Advertisement

కలిసికట్టుగా కరోనాను జయిద్దాం

Aug 1 2020 @ 05:25AM

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 

మధిర మునిసిపాలిటీలో శానిటైజ్‌ ట్రాక్టర్‌ ప్రారంభం


మధిర టౌన్‌, జూలై 31 : కలిసికట్టుగా కరోనాను జయించేందుకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఖమ్మం జిల్లా మధిర మునిపిపల్‌ కేంద్రంలో శానిటైజ్‌ చేసేందుకుగాను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, మధిర ప్రధాన వీధిలో శానిటైజ్‌ చేయించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మధిరలో త్వరితగతిన వ్యాప్తి చెందుతోందని, ప్రతీ ఒక్కరు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని, విధిగా మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లాది వాసు, రంగా హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు రమణగుప్తా, కౌన్సిలర్లు కోనా ధనికుమార్‌, మునుగోటి వెంకటేశ్వర్లు, నాయకులు దారా బాలరాజు, పల్లపోతుల ప్రసాదరావు, చావా వేణు, కర్నాటి రామారావు, పారుపల్లి విజయ్‌, రాజేందర్‌, చక్రి, మహ్మదలీ, బాబు, అద్దంకి రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement