ఫామ్‌హౌస్‌ పాలనను సాగనంపుదాం

ABN , First Publish Date - 2022-07-01T05:39:02+05:30 IST

సెక్రటేరియట్‌కు రాకుండా ఫామ్‌హౌస్‌లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించే దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కడే అని, ఫామ్‌హౌస్‌ పాలనను ఇంటికి సాగనంపుదామని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కోశాధికారి రాజేష్‌ అగర్వాల్‌ అన్నారు.

ఫామ్‌హౌస్‌ పాలనను సాగనంపుదాం
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి రాజేష్‌ అగర్వాల్‌

- అక్కడ్నుంచే రాష్ట్రాన్ని పరిపాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

- బీజేపీ జాతీయ కోశాధికారి, ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి రాజేష్‌ అగర్వాల్‌ 


వనపర్తి అర్బన్‌, జూన్‌ 30: సెక్రటేరియట్‌కు రాకుండా ఫామ్‌హౌస్‌లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించే దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కడే అని, ఫామ్‌హౌస్‌ పాలనను ఇంటికి సాగనంపుదామని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కోశాధికారి రాజేష్‌ అగర్వాల్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ సమావేశంలో భాగంగా నియోజకవర్గంలోని ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, నాయకురాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోజుకు 18గంటలు దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు రెండు గంటలు కూడా పనిచేస్తలేడని విమర్శించారు. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒక్కడే ఉన్నాడని, అతన్ని బీజేపీతోనే గద్దె దింపాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో ముప్పావు భాగం రాష్ర్టాల్లో బీజేపీ సొంతంగా, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, యువకుల శ్రమ ఫలితంగా సాధ్యమైందని, యువత తలుచుకుంటే సాధ్యంకానిది ఏదీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కరువైందని, మహిళలు, మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయని, యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేరు మార్చి రాష్ట్ర పథకాలుగా తప్పుడు ప్రచారం చేస్తు ప్రజలను మభ్య పెడుతున్నారని, మిగులు బడ్జెట్‌ గల రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌ జాతీయ పార్టీ జపం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశం ఉంటే అభివృద్ధి చెందిన దేశాలను సైతం వెనక్కి నెట్టి స్వదేశీయంగా వ్యాక్సిన్‌ తయారుచేసిన ఘనత భారతదేశానిదేనని కొనియాడారు. దాదాపు 200 కోట్ల పైచిలుకు కరోనా డోసులు ప్రజలకు వేయడం జరిగిందని అన్నారు. ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రపంచంలోని అనేక దేశాలకు అండగా ఉన్నామంటూ స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యాక్సిన్‌ పంపించారని దాని ఫలితంగా నేడు అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలు మనకు మద్దతుగా నిలుస్తున్న విషయం ఈరోజు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లితేనే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి బోసుపల్లి ప్రతాప్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింకల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు డి.నారాయణ, కె.మాధవరెడ్డి, ఏ.రామన్‌గౌడ్‌, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేతూరి బుడ్డన్న, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షుడు బండారు కుమారస్వామి, సుమిత్రమ్మ, సీతారాములు, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, కోశాధికారి బాశెట్టి శ్రీను, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు అశ్విని, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు, కార్యదర్శులు పద్మమ్మ, పరుశురాం, చెన్నయ్య, అధికార ప్రతినిధులు పెద్దిరాజు, బుచ్చిబాబుగౌడ్‌, బచ్చురాము, మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పన, దళిత మోర్చా అధ్యక్షుడు ఆగపోగు కుమార్‌, అసెంబ్లీ మాజీ కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు బోయేళ్ల రాము, ప్రధాన కార్యదర్శులు సూగూరు రాము, పెద్దపులి కిరణ్‌, రాయన్న, ఐటీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ విజయ్‌కుమార్‌సాగర్‌, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు గజరాజుల తిరుమలేష్‌, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.  

 జిల్లా అధికార ప్రతినిధిగా సంతోష్‌కుమార్‌ ఎన్నిక 

బీజేపీ అధికార ప్రతినిధిగా వనపర్తికి చెందిన జర్నలిస్టు సంతోష్‌కుమార్‌యాదవ్‌ ఎంపిక య్యారు. గురువారం పట్టణంలోని లక్ష్మికృష్ణ గార్డెన్‌లో ఏర్పా టుచేసిన బీజేపీ తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమం లో బీజేపీ జాతీయ కోశాధికారి రాజేష్‌అగర్వాల్‌ సమక్షంలో ఆయనను అధికార ప్రతినిధిగా ఎంపిక చేశారు. ఈ సంద ర్భంగా సంతోష్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడారు. పలువురు ఆ యనను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రా వుల రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజవర్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ, మీడియా కన్వీనర్‌ బచ్చు రాము ఉన్నారు.



Updated Date - 2022-07-01T05:39:02+05:30 IST