ప్రైవేటీకరణ ఆలోచనలను వీడాలి

ABN , First Publish Date - 2021-07-24T06:10:52+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనలను వీడాలని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు ఆయిల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి రాపెల్లి శ్రీనివాస్‌ అన్నారు.

ప్రైవేటీకరణ ఆలోచనలను వీడాలి
సిరిసిల్లలో ధర్నా చేస్తున్న యూనియన్‌ నాయకులు, సిబ్బంది

సిరిసిల్ల టౌన్‌, జూలై 23:  కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనలను వీడాలని  ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు ఆయిల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి రాపెల్లి శ్రీనివాస్‌ అన్నారు. జీవితా బీమా సంస్థలో ఐపీవో, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌  కంపెనీ,  నేషనలైజ్డ్‌ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని జీవితా బీమా కార్యాలయం వద్ద  యూనియన్‌  ఆధ్వర్యంలో ధర్నా చేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ  జీవితా బీమా సంస్థ(ఎల్‌ఐసీ) 76 సంవత్సరాలుగా ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తూ ప్రభుత్వ పథకాలకు నిధులను అందిస్తోందన్నారు. తమ పోరాటాలకు ప్రజలు, మేధావులు, కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని కోరారు.  కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు  కరుణాకర్‌, మల్లేశం, గౌరిశెట్టి శ్రీనివాస్‌, మోహన్‌, గాజుల శ్రీనివాస్‌, వీరేశం,  శ్రీకాంత్‌,  ప్రణీత పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:10:52+05:30 IST