టీఆర్‌ఎస్‌ను తరిమికొడదాం

ABN , First Publish Date - 2022-08-09T05:30:00+05:30 IST

ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ అప్పులపాలు చేశారని, టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌ను తరిమికొడదాం
అక్బర్‌పేటవాసులతో మాట్లాడుతున్న సంపత్‌కుమార్‌

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

అలంపూర్‌ జోగుళాంబ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం 

అలంపూర్‌/ ఉండవల్లి, ఆగస్టు 9 : ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ అప్పులపాలు చేశారని, టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అలంపూర్‌ నియోజకర్గంలో చేపట్టిన ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ముందుగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావే శంలో, మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపత్‌కుమార్‌ మాట్లా డారు. నియోజకవర్గంలోని 42 గ్రామాల మీదుగా 152 కిలోమీటర్ల పాదయాత్ర ఈ నెల 15 వరకు నిర్వహిస్తామని వివరించారు. కేంద్ర ంలోని బీజేపీ కుల మతాల చిచ్చులేపి, ప్రజల్లో అనైక్యతను సృష్టిస్తోందని ఆరోపించారు. అలంపూర్‌ ఎమ్మెల్యే కమీషన్లు దండుకుంటున్నారని ప్రజలే చెప్పుకుంటున్నారన్నారు. ఇటీవల అలంపూర్‌లోని అక్బర్‌పేట కాలనీ వరద తాకిడికి గురైనా ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పాద యాత్ర అలంపూర్‌ నుంచి ఇమాంపూర్‌, లింగనవాయి మీదుగా కంచుపాడుకు చేరుకున్నది. నాయకులు రాత్రి అక్కడే బస చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరెడ్డి, నరేందర్‌రెడ్డి, డాక్టర్‌ రాజన్న, వెంకట నారాయణరెడ్డి, నాగార్జునరెడ్డి, శ్యామ్‌, దుబ్బ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్‌ ఇంతియాజ్‌, నరసింహ, పరశురాం, గజేందర్‌రెడ్డి, షేక్షేవలి ఆచారి, ధర్మరాజు, పాండు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T05:30:00+05:30 IST