మలేరియా రహిత సమాజంగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2021-04-24T04:31:45+05:30 IST

లక్ష్యానికి చేరువలో మలేరియా రహిత సమాజంగా తీర్చిదిద్దాలని మలేరియా సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ వై. ప్రసాద్‌యాదవ్‌ పేర్కొన్నారు.

మలేరియా రహిత సమాజంగా తీర్చిదిద్దుతాం

లక్కిరెడ్డిపల్లె, ఏప్రిల్‌23: లక్ష్యానికి చేరువలో మలేరియా రహిత సమాజంగా తీర్చిదిద్దాలని మలేరియా సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ వై. ప్రసాద్‌యాదవ్‌ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా  శుక్రవారం లక్కిరెడ్డిపల్లెలోని అన్ని మురికివాడల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ దోమల నివారణకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం డ్రైడే నిర్వహించిందని, దీనివల్ల ప్రతి గ్రామంలోనూ ఏఎన్‌యంలు పర్యటించాలన్నారు.   ఈ నెల 23, 24, 25వ తేదీల్లో వైద్య సిబ్బంది మలేరియాపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో దోమతెరలు పంపిణీ చేశామని, ప్రతి ఒక్కరూ ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌యం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:31:45+05:30 IST