ఇంటింటా జెండాను ఎగురవేద్దాం

Published: Tue, 09 Aug 2022 23:45:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇంటింటా జెండాను ఎగురవేద్దాంగజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో జాతీయ జెండాను పంపిణీ చేస్తున్న ప్రతా్‌పరెడ్డి

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

పలు మండలాల్లో జాతీయ జెండాల పంపిణీ

గజ్వేల్‌, ఆగస్టు 9: ఇంటింటా జెండాను ఎగురవేసి, దేశభక్తిని పెంపొదిద్దామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పిలుపునిచ్చారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వార్డు కౌన్సిలర్‌ గుంటుకు శిరీషారాజుతో కలిసి ఆయన ఇంటింటికి జెండా పంపిణీలో పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండాను తప్పకుండా ఎగురవేయాలని సూచించారు. కాగా మునిసిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో మునిసిపల్‌ చైర్మన్‌ రాజమౌళి ఆధ్వర్యంలో వైస్‌ చైర్మన్‌ జకీ, కౌన్సిలర్లు జాతీయ జెండాను పంపిణీ చేశారు.

గజ్వేల్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గురువారెడ్డి, యెల్లు రాంరెడ్డిలు పిలుపునిచ్చారు. గజ్వేల్‌ పట్టణంలోని బీజేపీ సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి స్వగృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 

గజ్వేల్‌: గజ్వేల్‌ మండల పరిధిలోని బయ్యారంలో ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో జాతీయజెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

గజ్వేల్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రయాణీకులకు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు టీఎ్‌సఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, విశ్రాంత ఐపీఎస్‌ రవీందర్‌ తెలిపారు. గజ్వేల్‌లోని బస్టాండ్‌లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనవెంట డిపో మేనేజర్‌ శ్రీనివా్‌సరావు, సీఐ కనకలక్ష్మి ఉన్నారు. 

గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ మండలంలోని బయ్యారం, బేజాగాం గ్రామాల్లో గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, ఎంపీడీవో మచ్చేంద్ర జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు కౌన్సిల్‌ సభ్యులకు, అధికారులకు మంగళవారం జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

సిద్దిపేట క్రైం: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే వజ్రోత్సవ సంబరాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివా్‌సయాదవ్‌ పాల్గొన్నారు. 

సిద్దిపేట: పాత కూరగాయల మార్కెట్‌లోని దాసాంజనేయస్వామి ఆలయంలో దాసాంజనేయ ఆర్యవైశ్య ఫ్యామిలీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 75 కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 

సిద్దిపేట అర్బన్‌: సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రేణుకాశ్రీనివాస్‌, ఎంపీటీసీ మమతాయాదగిరి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం హుస్నాబాద్‌లో గాంధీ చౌరస్తాలో చైర్‌పర్సన్‌ ఆకుల రజిత జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆర్డీవో జయచంద్రారెడ్డి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. హుస్నాబాద్‌లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, ఆర్డీవో జయచంద్రారెడ్డి ప్రారంభించారు. 

చేర్యాల: చేర్యాలలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో వార్డులవారీగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వర్గల్‌: వర్గల్‌ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా పంపిణీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాలిగామ లతారమే్‌షగౌడ్‌, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

కొండపాక: కొండపాక మండలం లకుడారం గ్రామంలో సర్పంచ్‌ కందూరి కనకవ్వఐలయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాలను  పంపిణీ చేశారు. అలాగే మంగోల్‌లో సర్పంచ్‌ కిరణ్‌కుమార్‌ తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు.

రాయపోల్‌: రాయపోల్‌ మండలంలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని ఎంపీపీ కల్లూరి అనిత, జడ్పీటీసీ యాదగిరి పేర్కొన్నారు. రాయపోల్‌లో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి 27 మంది సభ్యులు ఉండగా, కేవలం ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. 

నంగునూరు: నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి చేతులమీదుగా ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేశారు. నంగునూరులో జాతీయ జెండా ప్రాముఖ్యతను వివరిస్తూ ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి, నల్లపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ మహేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కోల రమే్‌షగౌడ్‌ ప్రధాన వీధుల్లో ర్యాలీ తీసి అవగాహన కల్పించారు.  

పలు థియేటర్లలో మహాత్మాగాంధీ సినిమా ప్రదర్శన

గజ్వేల్‌, ఆగస్టు 9: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గజ్వేల్‌ పట్టణంలోని పలు థియేటర్లలో విద్యార్థులకు స్వాతంత్ర్యోద్యమ చరిత్రను తెలియజెప్పేందుకు గాంధీ చలనచిత్రాన్ని ప్రదర్శింపజేశారు. ములుగు మండలానికి చెందిన 300, జగదేవ్‌పూర్‌లోని 247, గజ్వేల్‌ మండలంలోని 900 మంది విద్యార్థులు గజ్వేల్‌ పట్టణంలోని సంతోష్‌ థియేటర్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక షోలో తిలకించారు. 

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని వెంకటేశ్వర కళామందిర్‌లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మండలంలోని జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మహాత్మా జ్యోతిరావు ఫూలే, అక్కన్నపేట కేజీబీవీ పాఠశాల విద్యార్థులు గాంధీచిత్రాన్ని ప్రదర్శించారు.  

మద్దూరు: మద్దూరు మండలంలోని కస్తూర్భా గాంధీ పాఠశాల బాలికలకు గాంధీ చిత్రాన్ని చూపెట్టినట్లు ఎంఈవో నర్సింహారెడ్డి తెలిపారు. 116 మంది విద్యార్థులు, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారు. 

సిద్దిపేట క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం పోలీస్‌ సిద్దిపేట డివిజన్‌ పరిధిలోని సిద్దిపేట రూరల్‌, చిన్నకోడూరు, రాజగోపాలపేట, బెజ్జంకి పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌, కేజీబీవీ స్కూల్‌ విద్యార్థులకు సిద్దిపేటలో వెంకటేష్‌ కళామందిర్‌, బాలాజీ, శ్రీనివాస్‌ థియేటర్లలో గాంధీ సినిమా చూపించారు. 

వజోత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలు

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 9: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టర్‌ ఆదేశానుసారం 18న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి నాగేందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న మండలస్థాయి జట్ల ఎంపికలు నిర్వహిస్తామని, అక్కడ ప్రతిభ కనబర్చినవారు 18న సిద్దిపేట జరగబోయే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ క్రీడల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు కలెక్టర్‌ చేతులమీదుగా బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా యవజన క్రీడలశాఖ కార్యాలయంలో కానీ, 9014580816, 9052025009 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.