స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకుందాం

ABN , First Publish Date - 2022-08-09T06:54:10+05:30 IST

జిల్లా వ్యాప్తంగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి..

స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకుందాం
హుజూర్‌నగర్‌లో జాతీయ నేతలకు నివాళులర్పిస్తున్న నాయకులు

జిల్లా వ్యాప్తంగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా పలు పాఠశాల ను మామిడి తోరణాలతో అలంకరించారు. విద్యార్థు లు దేశ పతాకాలను స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించారు. బీజేపీ ఆధర్యంలో జాతీయ ప తాకాలను ఆ  పార్టీ నాయకులు ఇంటింటికీ పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.  

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌


దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధులను  ఊరూ-వాడా స్మరించుకుందామని తుంగతుర్తి ఎంఈవో బోయని లింగయ్య అన్నారు. మండలంలోని  వెలుగుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వజ్రోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర సమర యోధులను పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ు పాల్గొన్నారు. 

- నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలలో త్రివర్ణ పతాకాలు ఏర్పాటు చేశా రు. మామిడి తోరణాలతో పాఠశాలలను అలంకరించా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం మధుపాల్గొన్నారు.

- తిరుమలగిరి మండలం మామిడాల ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్‌ కర్ణాకర్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించినవారిని స్మరిస్తూ వజ్రోత్సవా న్ని నిర్వహిస్తున్నామని,స్వాతంత్య్రం స్ఫూర్తితో ప్రతీ ఒక్క రు పనిచేయాలన్నారు. ముందుగా పాఠశాలలో జెం డా లు,మామిడి తోరణాలుకట్టి మహిళలచే ముగ్గులు వేయించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

- హుజూర్‌నగర్‌లోని ఎన్‌ఎస్పీ క్యాంపులో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ, గాంధీ, సరస్వతిదేవి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు.  మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వజ్రోత్సవాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌ రమ్య నాగరాజు, గోవింద్‌, శేఖర్‌,రవి, కిషోర్‌, ఎంఈవో సైదానాయక్‌, ఉపాధ్యాయు లు శివయ్య, అరుణకుమారి, శాంత, అలీం, పెండెం శ్రీనివాస్‌,సమీనా, లక్ష్మీకాంత్‌, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

కోదాడ మండలం రామలక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించారు. విద్యార్థులతో రంగోళి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఏ.హనుమంతరావు, ఉపాధ్యాయులు బడుగుల సైదులు, గ్రామపెద్దలు మస్తాన్‌, వెంకటరెడ్డి, శివ, అంగన్‌వాడీ టీచర్‌ స్వరాజ్యం, విద్యార్థులు పాల్గొన్నారు. 

హైదరాబాద్‌కు తరలిన టీఆర్‌ఎస్‌ నాయకులు

 హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిర్వహించిన వజ్రోత్సవాలకు సూర్యాపేట మండ లం నుంచి  మేళ్లచెర్వు  మండలం నుంచి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ ఆఽధ్వర్యంలో జిల్లాకు చెం దిన జడ్పీటీసీ సభ్యుల బృందం తలిలి వెళ్లింది. మేళ్లచెర్వు నుంచి ఎంపీపీ కొట్టె పద్మ సైదేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ గోవిందరెడ్డి, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ మెంబర్‌ షేక్‌ ఇమ్రాన్‌ తరలివెళ్లారు.  కార్యక్రమంలో సీఈవో సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ పేద కుటుంబానికి స్వాతంత్య్ర  ఫలాలు: ఎంపీపీ, జడ్పీటీసీ

 ప్రతీ పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర ఫలాలు అందిస్తోందని హుజూర్‌నగర్‌ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, జడ్పీటీసీ కొప్పుల సైది రెడ్డిలు అన్నారు. సోమవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలుచేయడంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంద న్నారు.  కార్యక్ర మంలో ఎంపీపీలు పార్వతి కొండానాయక్‌, జగన్‌నాయక్‌, పెండెం శ్రీను, పెండెం సుజాత, చంద్రకళ  పాల్గొన్నారు.

ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ 

 ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా సోమవారం కోదాడలోని  18వ వార్డులో ఇంటింటికీ జాతీయ జెండాలను బీజేపీ జిల్లా నాయకుడు  సా తులూరి హనుమంతురావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మండలంలోని గుడిబండ గ్రామంలో జాతీ య జెండాలను బీజేపీ నాయకుడు యరగాని రాధాకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్య క్షుడు నకిరేకంటి జగన్మోహన్‌రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి వెంకటేష్‌,  పోలాల సురేష్‌, గట్ల మహేశ్వరి, కోటకొమ్ముల భాగ్యలక్ష్మి,  పిడతల శంకర్‌ రావు, గోపి, అనంతుల దాసయ్య, చింతా నర్సిరెడ్డి, సోమగాని ఉప్పయ్య, బెజవాడ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 






Updated Date - 2022-08-09T06:54:10+05:30 IST