Advertisement

‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం

Jan 24 2021 @ 00:22AM
చీపురుపల్లి : లోకేష్‌ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తల నడుమ కేక్‌ కట్‌ చేస్తున్న కిమిడి నాగార్జున

విజయనగరం పార్లమెంటరీ  టీడీపీ ఇన్‌చార్జి  నాగార్జున

ఘనంగా నారా లోకష్‌ జన్మదిన వేడుకలు

చీపురుపల్లి, జనవరి 23 : వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో  సత్తా చూపేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని విజయ నగరం పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున పిలుపుని చ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజు సంద ర్భంగా శనివారం చీపురుపల్లిలోని తన నివాసంలో కార్యకర్తలు, అభిమానుల నడుమ కేక్‌కట్‌ చేసి సందడి చేశారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతీ కార్యకర్త తామే అభ్యర్థిగా భావించి పని చేసి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని కోరారు. అందరూ సమన్వయంతో పనిచేసి రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, ఇజరోతు రాంబాబు, రౌతు నారాయణరావు, గవిడి నాగరాజు, పైల బలరాం తదితరులు పాల్గొన్నారు.

విజయం మనదే

ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు

జియ్యమ్మవలస : రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేసిన నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలో విజయ ఢంకా మోగిస్తామని ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. శనివారం ఆయన చినమేరంగిలో తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఐదు మండలాల్లో గెలిచి తీరుతామన్నారు. దీనికై అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలబెడతామన్నారు. మేము గతంలో చేసిన సంక్షేమ పనులే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు దత్తి లక్ష్మణరావు, ఎన్‌.మధుసూదనరావు, డొంకాడ రామకృష్ణ, అంధవరపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం..

బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బేబీనాయన 

రామభద్రపురం : రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోందని, ఈ పాలన నుంచి ప్రజలను విముక్తులను చేయడానికి టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) పిలుపునిచ్చారు. మండల పార్టీ కార్యాలయంలో శనివారం టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేం దుకు అవసరమైన కార్యచరణ చేపట్టాల్సి అవసరం ఉందన్నారు. ఇదిలావుంటే ఇట్లామామిడిపల్లి గ్రామానికి చెందిన లెంక వెంకటరమణ, బెల్లాన నరసింగరావు, లెంక పైడిరాజు తదితర కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు శనివారం టీడీపీ కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేబీనాయన కేక్‌ కట్‌ సందడి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు (రాజా),  చింతల రామకృష్ణ, మడక తిరుపతిరావు, పెద్దింటి లక్ష్ముంనాయుడు, కనిమెరక శంకరరావు, కరణం విజయభాస్కర్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.  

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.