అభివృద్ధి పనులకు సహకరిద్దాం

ABN , First Publish Date - 2021-03-07T04:47:04+05:30 IST

గ్రామాలలో అభివృద్ధి పనులకు వేగంగా తోడ్పా టునందించేందుకు వలంటీర్లు గ్రామాలలో రాజకీయ దురుద్దేశాలు మాని అభివృద్ధి పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని పెనగలూరు ఎంపీడీవో పి.వరప్రసాద్‌ సూచించారు.

అభివృద్ధి పనులకు సహకరిద్దాం
వలంటీర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో

పెనగలూరు, మార్చి6 : గ్రామాలలో అభివృద్ధి పనులకు వేగంగా తోడ్పా టునందించేందుకు  వలంటీర్లు గ్రామాలలో రాజకీయ దురుద్దేశాలు మాని అభివృద్ధి పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని పెనగలూరు ఎంపీడీవో పి.వరప్రసాద్‌ సూచించారు. శనివారం సాయంత్రం నల్లపురెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ పి.హరి అఽ ద్యక్షతన సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ లేబాక శ్రీనివాసులరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ కార్యదర్శి అష్రఫ్‌వల్లి,వీఆర్వో పెంచలయ్య, గ్రామపెద్దలు కె.నరసింహారెడ్డి, పాలిరెడ్డి, ఎల్‌.అశోక్‌రెడ్డి, కె.శివ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:47:04+05:30 IST