రైతులను ఆదుకుంటాం : స్పీకర్‌ పోచారం

ABN , First Publish Date - 2021-04-18T04:40:58+05:30 IST

వరి పంట కోతకు వచ్చిన సమయంలో వడగళ్ల వాన కురిసి, పంట నేల రాలడం బాధాకరమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

రైతులను ఆదుకుంటాం : స్పీకర్‌ పోచారం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం

నస్రుల్లాబాద్‌, ఏప్రిల్‌ 17: వరి పంట కోతకు వచ్చిన సమయంలో వడగళ్ల వాన కురిసి, పంట నేల రాలడం బాధాకరమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నస్రుల్లాబాద్‌ మండలంలోని నాచుపల్లి, మైలారం, నెమ్లి, బొమ్మన్‌దేవ్‌పల్లి, నస్రు ల్లాబాద్‌ తదితర గ్రామాల రైతులతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడా రు. గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవ డానికి ప్రయత్నిస్తానన్నారు. కోతకు వచ్చిన పంట గత బుధవారం రాళ్లవానతో నేల రాలడం పట్ల తాను బాధపడుతున్నానన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిం చి సర్వే చేసి నష్టపోయిన ప్రతీ రైతు పేరును నమోదు చేయాలని ఆదేశించారు. నష్టపోయి న రైతులను పూర్తిగా ఆదుకోలేక పోయినా ప్రభుత్వం తరఫున కొంత వరకైనా ఆర్థిక సహా యం అందించి వారిని ఆదుకుంటామన్నారు. కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించి, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. నాచుపల్లి గ్రామంలో ఎక్కువ మొత్తంలో పంట పొలాలు దెబ్బతిన్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు స్పీకర్‌ దష్టికి తీసుకుని రాగా, నష్టపోయిన ప్రతీ రైతు పొలాలను నమోదు చేయాలని సూచి ంచారు. కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదికను పంపించి సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడి ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ద్వారా ఎకరాకు రూ.5,400 అందించే విధంగా రైతులకు సహాయం చేస్తామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు ఆంజనేయులు, సొసైటీ చైర్మన్‌ పెర్క శ్రీనివాస్‌, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T04:40:58+05:30 IST