పోడుభూములకు పట్టాలివ్వాలి

ABN , First Publish Date - 2022-07-07T04:52:37+05:30 IST

పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ మండలంలోని చౌడవరం గ్రామానికి చెందిన పోడుసాగుదారులు సీపీఐఎంఎల్‌ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ రమాదేవికి ఒక వినతిపత్రం సమర్పించారు.

పోడుభూములకు పట్టాలివ్వాలి

పెనుబల్లి, జూలై 6: పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ మండలంలోని చౌడవరం గ్రామానికి చెందిన పోడుసాగుదారులు సీపీఐఎంఎల్‌ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ రమాదేవికి ఒక వినతిపత్రం సమర్పించారు. ముందుగా పోడుసాగుదారులు మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి అనంతరం రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మండలంలోని చౌడవరం(కేడబ్ల్యూ)లోతువాగు ప్రాజెక్టు పరిధిలో 20ఏళ్లుగా పోడుసాగుచేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. రెండు సంవత్సరాలుగా అటవీశాఖ అధికారులు పోడుభూముల్లోకి తమను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం నుంచి తమకు రక్షణ కల్పించి పట్టాలు ఇప్పించాలని వినతిపత్రంలో కోరారు. పోడుసాగుదారులు, నాయకులు పాల్గొన్నారు.

సమన్వయంతో వ్యవహరించాలి: సీఐ

పోడుసాగుచేస్తున్న గిరిజనులు అటవీశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమస్యను పరిష్కరించుకోవాలని సత్తుపల్లి కరూరల్‌ సీఐ హనుక్‌ అన్నారు. బుధవారం పెనుబల్లి మండలపరిషత్‌ కార్యాలయంలో అటవీశాఖ అధికారులు, పోడుసాగుదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సత్తుపల్లి అటవీశాఖ రేంజర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సూరజ్‌, డీఆర్‌వో రామకృష్ణ, పోడుసాగుదారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T04:52:37+05:30 IST