రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

ABN , First Publish Date - 2022-05-26T06:22:23+05:30 IST

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని, అందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి 

భువనగిరిరూరల్‌, మే 25: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని, అందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు. అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ ది నోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ఆవరణ లో వేడుకలకు ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా లబ్ధిదారులకు ఆస్తు ల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా కలెక్టరేట్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలను జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి మాన్యానాయక్‌ కు అందజేయాలని సూచించారు. పోలీ్‌సపరేడ్‌కు అవసరమైన స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లుచేయాలని డీసీపీ కె.నారాయణరెడ్డికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, భువనగిరి ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డి, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరచారి, తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు లక్ష్మణ్‌, డాక్టర్‌ వి.కృష్ణ, కె.అనురాధ, కె.నర్సింహ, శ్రీనివా్‌సరావు, శంకరయ్య, ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:22:23+05:30 IST