సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్దాం

ABN , First Publish Date - 2022-08-19T07:15:13+05:30 IST

మొగల్స్‌ అరాచకాలపై పోరాటం చేసి రాజ్యాధికారం కోసం అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొని గోల్కొండ కోట గోడ లు బద్ధలు కొట్టిన సర్వాయి పాపన్న స్ఫూర్తితో అందరం ముందుకెళ్లాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి రామ్‌కిషన్‌రెడ్డి అన్నారు.

సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్దాం
విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌

జడ్పీ చైర్‌పర్సన్‌ కె.విజయలక్షి ్మ  

అంతటా పాపన్న జయంతి వేడుకలు 

నిర్మల్‌ అర్బన్‌, ఆగస్టు 18 : మొగల్స్‌ అరాచకాలపై పోరాటం చేసి రాజ్యాధికారం కోసం అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొని గోల్కొండ కోట గోడ లు బద్ధలు కొట్టిన సర్వాయి పాపన్న స్ఫూర్తితో అందరం ముందుకెళ్లాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి రామ్‌కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వాయి పాపన్న 372 జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... నిరుపేద గీత పారిశ్రామిక కుటుంబంలో పుట్టి మొగల్‌ పాలనలో హింస భరించలేక ఎదురొడ్డి వారి అరాచక పాలనపై పోరాటం చేసిన గొప్ప మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. 13 మంది యువకులతో గెరిల్లా సైన్యాన్ని ప్రారంభించి అనధికాలంలోనే వేలాది మంది సైన్యాన్ని నిర్మించి 20 రాజ్యాలతో పాటు గోల్కొండకోటను సైతం స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు రాజ్యాధికారం కొనసాగించిన పోరాట యోధుడని ఆమె కొని యాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సర్వాయి పాపన్న కు అసలైన నివాళి దక్కిందన్నారు. ఆయన ఆశయాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.  

వేడుకలకు హాజరైన కలెక్టర్‌

సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ హాజరయ్యారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న పాపన్న విగ్రహానికి కలెక్టర్‌తో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నేతలు, గీత పరిశ్రమ సహకార సంఘం చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు కే. రామాగౌడ్‌, మల్కాగౌడ్‌, డి. రామా గౌడ్‌, డాక్టర్‌ రమణగౌడ్‌, రామకృష్ణగౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యులు ప్రకాష్‌గౌడ్‌, నారాగౌడ్‌, కృష్ణమోహన్‌గౌడ్‌, వేణుగోపాల్‌గౌడ్‌, దేవేందర్‌ గౌడ్‌, గణేష్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

పాపన్నగౌడ్‌ పోరాట పటిమ మరువలేనిది

ఖానాపూర్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ పోరాటం మరువలేనిదని టీజీవో నాయకుడు అజ్మీరా శ్యామ్‌నాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

పాపన్న స్ఫూర్తితో రాజ్యాధికారం సాధిద్దాం

కడెం : సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ స్ఫూర్తితో బహుజన సమాజ్‌ పార్టీ బహుజనులకు అధికారమే లక్ష్యంగా కృషి చేద్దామని ఆ పార్టీ జిల్లా ఇన్‌ చార్జి బన్సీలాల్‌ రాథోడ్‌ పిలుపునిచ్చారు. కడెం మండల కేంద్రంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు నివా ళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్‌ అసెంబ్లీ పరిధిలోని మండలాల ముఖ్య నాయకులు హాజరు కాగా ఖానాపూర్‌ అసెంబ్లీ ఇంచార్జి చౌహాన్‌ విజయ్‌ నాయక్‌, ఉపాధ్యక్షుడు శివాజీ, మండల కన్వీనర్‌ భూక్యా వినోద్‌ నాయక్‌ తదితర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T07:15:13+05:30 IST