రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఆచరిద్దాం

ABN , First Publish Date - 2021-11-27T06:35:31+05:30 IST

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఆయా ధర్మాలను అనుసరించాలని కనిగిరి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఇన్‌చార్జ్‌ ఎస్‌.భార్గవి అన్నారు.

రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఆచరిద్దాం
మాట్లాడుతున్న చైర్మన్‌ గఫార్‌

కనిగిరి, నవంబరు 26: భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఆయా ధర్మాలను అనుసరించాలని కనిగిరి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఇన్‌చార్జ్‌ ఎస్‌.భార్గవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ నాయకులు అడ్వకేట్‌ పిచ్చయ్య, గుడ్‌హెల్ప్‌ రమేష్‌, పోలీసు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటించి ప్రతిజ్ఞ చేయించారు. తొలుత ఒంగోలు బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీవో శాంతి, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ చెన్నకేశవులు, పారిశుధ్య సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ హైస్కూల్‌లో హెచ్‌ఎం ఎంవీవీ ప్రసాదరావు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.   కార్యక్రమంలో ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు సంజీవి, రత్నం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.  

పామూరులో: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న భారత రాజ్యాగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీపీ గంగసాని లక్ష్మీ, సింగిల్‌విండో చైర్మన్‌ పువ్వాడి వెంకటసుజాతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, మండల కో ఆప్షన్‌ సభ్యులు నాయబ్‌ రసూల్‌, జి హుస్సేన్‌రెడ్డి, పాల్గొన్నారు. 

తాళ్లూరు : అన్నివర్గాల ప్రజలకు సముచిత న్యాయం అందేలా డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రచించాడని తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య అన్నారు. స్థానిక అంబేద్కర్‌నగర్‌లో 72వ రాజ్యాంగ ఆమోదదినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్యఎస్సై బి.నరసింహారావు, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, ఎంఈవో జి.సుబ్బయ్య, గ్రామసర్పంచ్‌ చార్లెస్‌ సర్జన్‌, తాళ్లూరు-2 ఎంపీటీసీయామర్తి ప్రభుదాసు, నెహ్రూ యువజన కేంద్రం మండల కోఆర్డినేటర్‌ ఆరిక అంబేడ్కర్‌, ప్రధానోపాధ్యాయులు ఇడమకంటి కృష్ణారెడ్డి,  అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థిని, విద్యార్థులు, అంబేద్కర్‌నగర్‌ యూత్‌ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

దర్శి : రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని ఎంపీపీ సుధారాణి సూచించారు. భారత రాజ్యాంగ 72వ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్దానిక మండల పరిషత్‌ కార్యాలయంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సోము దుర్గారెడ్డి, ఎంపీడీవో జీ శోభన్‌బాబు, జి.అచ్చయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శి నగర పంచాయతీ చైర్మెన్‌ నారపుశెట్టి పిచ్చయ్య పలువురు టీడీపీ నాయకులు, దళిత ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్‌ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 ముండ్లమూరులోని అంబేద్కర్‌ కాలనీ వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి డీబీఆర్‌సీ కో-ఆర్డినేటర్‌ దార్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కురిచేడు: కురిచేడు శాఖా గ్రంధాలయంలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.   గ్రంథపాలకుడు ఎల్‌ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌, రాజ్యాంగ కమిటీ సభ్యులు బాబూ రాజేంద్రప్రసాద్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.  పంచాయతీ కార్యదర్శి లంకా జానకి రామయ్య పాల్గొన్నారు.  

సీఎ్‌సపురం : స్థానిక గ్రంథాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రంథపాలకుడు ఆళ్ల భాస్కరరావు విద్యార్థులతో కలిసి అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే స్థానిక ఎస్టీ ప్రాథమిక పాఠశాలలో కూడా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

Updated Date - 2021-11-27T06:35:31+05:30 IST