కొవిడ్‌ బాధితులకు అండగా నిలుద్దాం

ABN , First Publish Date - 2021-05-11T04:49:28+05:30 IST

కొవిడ్‌ బాధితులకు అండగా నిలుద్దామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కొవిడ్‌ బాధితులకు అండగా నిలుద్దాం
చెక్కులను పంపిణీ చేస్తున్న చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

చిన్నమండెం, మే10: కొవిడ్‌ బాధితులకు అండగా నిలుద్దామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని టీ.చాకిబండ, చిన్నమండెం పీహెచ్‌సీలో సోమవారం ఆయన పర్యటించారు. ముందస్తు ప్రణాళికలతో రోగులకు వైద్యసేవలు అందించాలన్నారు. పీహెచ్‌సీలో కొవిడ్‌ ఐసోలేషన్‌ రూములను ఏర్పాటు చేసి ఆక్సిజన్‌, బెడ్లు సమకూర్చాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలు, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, బాధితులకు ఐసోలేషన్‌ కిట్లు అమలు, పారిశుధ్య చర్యలు, కంట్రోల్‌ రూము ఏర్పాటు, హెల్ఫ్‌లైన్‌ తదితర అంశాలపై తహసీల్దార్‌ నాగే శ్వర్‌రావు, ఎంపీడీవో బాలమునెయ్య, రూరల్‌సీఐ లింగప్ప, వైద్యాఽధికారి మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ మైనుద్దీన్‌ తదితర అధికారులతో చర్చించారు. కర్ఫ్యూ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని  పోలీసు అధికారులను ఆదేశించారు. 

కొండంత అండగా సీఎం సహాయనిధి... మండలంలోని ఐదుగురికి  ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,05,000 జెడ్పీ మాజీ వైస్‌ చైర్మెన్‌ దేవనాధరెడ్డితో కలిసి చెక్కులను చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, ఎంపీడీవో బాలమునెయ్య, సర్పంచులు, ఎంపీటీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T04:49:28+05:30 IST