గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుందాం

ABN , First Publish Date - 2021-07-30T06:54:45+05:30 IST

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామం స్ఫూర్తితో భువనగిరి మండలం నమాత్‌పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్‌ ఎల్లంల శాలిని, ఎంపీటీసీ సభ్యురాలు మట్ట పారిజాత అన్నారు.

గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుందాం
వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ పంచాయతీని సందర్శించిన నమాత్‌పల్లి పంచాయతీ పాలకవర్గం సభ్యులు

 భువనగిరి రూరల్‌, జూలై 29:  అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామం స్ఫూర్తితో భువనగిరి మండలం నమాత్‌పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్‌ ఎల్లంల శాలిని, ఎంపీటీసీ సభ్యురాలు మట్ట పారిజాత అన్నారు.   గంగదేవి పల్లి గ్రామాన్ని నమాత్‌పల్లి పంచాయతీ పాలకవర్గం సభ్యులు గురువారం సందర్శించారు. ఆ  గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి పథకాలను పరిశీ లించారు. మహిళా సంఘాల పని తీరు, ఉపాధిహామీ పథకం, హరితహారం, ‘పల్లె ప్రకృతి’ తదితర పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌, ఎంపీటీసీ మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ జిట్ట లక్ష్మీరెడ్డి, పంచాయతీ కార్యదర్శి  ఎ.శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ పబ్బతి రాములు, వార్డు సభ్యులు కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-30T06:54:45+05:30 IST