మహనీయుల మార్గంలో పయనిద్దాం

ABN , First Publish Date - 2020-11-29T05:46:16+05:30 IST

మహనీయుల మార్గంలో పయనించాలని నాయకులు అన్నారు. మండలంలోని అర్గుల్‌ గ్రామంలో శనివారం పూలే వర్ధంతిని నిర్వహించారు.

మహనీయుల మార్గంలో పయనిద్దాం
అర్గుల్‌లో ఫూలే వర్ధంతిని నిర్వహిస్తున్న నాయకులు

జక్రాన్‌పల్లి, నవంబరు28: మహనీయుల మార్గంలో పయనించాలని నాయకులు అన్నారు. మండలంలోని అర్గుల్‌ గ్రామంలో శనివారం పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రాజేందర్‌, దళితశక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్‌ మహేష్‌, పద్మరావు, ముత్తెన్న, మహేష్‌, దీప క్‌, తదితరులు పాల్గొన్నారు. 

కమ్మర్‌పల్లి : అంటరానితనం, మహిళలకు విద్యాబోధన అంశాలపై వి ప్లవ పోరాటాలు చేసి విజయం సాధించిన సామాజిక విద్యా విప్లవకారు లు మహిళల తొలిగురువు పూలే  అని సామాజిక విశ్లేషకులడు బి. సుద ర్శన్‌ అన్నారు. శనివారం ఉప్లూర్‌లో ముదిరాజ్‌ యువజన సంఘాల ఆ ధ్వర్యంలో పూలే  వర్ధంతి సభ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో మహిళలు, అట్టడుగువర్గాల కోసం పాఠశాలలు స్థాపించి వారికి విద్యనందించిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. అం తకుముందు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు ఎస్‌.దేవన్న, బాల్‌రాజ్‌, బీఎస్పీ నాయకుడు ర మేష్‌ యాదవ్‌, ఏవైఎస్‌ మండల అధ్యక్షుడు సుంకరి విజయ్‌ కుమార్‌, ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఎన్‌.కిషన్‌, మందశ్రీను, కిషన్‌గౌడ్‌, శైలేంధర్‌, రాజేష్‌, నవీన్‌, దయానంద్‌, సుభాష్‌, నర్సింహ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.  

పెర్కిట్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణభవన్‌లో శనివారం పూలే  వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీవైఎల్‌ ఆధ్వర్యంలో చి త్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో పాతుకుపో యిన కులవ్యవస్థ, అంటరానితనం, స్త్రీలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరా డిన గొప్పసామాజిక సంస్కార్త అని కొనియాడారు. పూలే స్ఫూర్తితో ఆ యన కలలుగన్న సమాజం కోసం నేటితరం ఆయన బాటలో సాగాలని కోరారు. కార్యక్రమంలో పీవైఎల్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌, రాష్ట్ర నాయకు లు సుమన్‌, బోజేందర్‌, యుగంధర్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.  

సిరికొండ: సమాజంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడాని కి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పూలే  అని ఎంజేపీ బీసీ గు రుకులాల పీఆర్‌వో మహిపాల్‌ అన్నారు. సిరికొండ మండలం చీమన్‌పల్లి పాఠశాలలో పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక విప్లవోద్యమ నా యకులు, సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను పారదోలడాని కి ఎంతో తోడ్పాటును అందించిన మహనీయుడు అని అన్నారు. కలలు కన్నా ఆశయాల సాధన కోసం ప్రతిజ్ఞ పూనుదామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మోర్తాడ్‌ : మండల దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే  వ ర్ధంతిని నిర్వహించారు. మండల కేంద్రంలోని జాతీయరహదారి పక్కన గల పూలే  విగ్రహానికి మల్లూరి రాజారాం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనను ఆదర్శంగా తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమాల ను మల్లూరి రాజారాం, జంబవా మదిగ, మామిడి గంగాధర్‌, శ్రీకాంత్‌, గంగాధర్‌, రవి, రాజు పాల్గొన్నారు. 

వేల్పూర్‌ : పలు గ్రామాల్లో పూలే వర్ధంతిని నిర్వహించారు. పచ్చలన డ్కుడలో ఎంపీడీవో కమలాకర్‌రావు, సర్పంచ్‌ ఏనుగు శ్వేత గంగారెడ్డి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రామన్నపే ట్‌ గ్రామంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి సం దర్భంగా ఏవైఎంఎ అధ్యక్షుడు జంబావ మహరాజ్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దురాజ్‌ రవి, డిష్‌ నాగరాజు, అనంత్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:46:16+05:30 IST