ముదిరాజ్‌ల హక్కుల సాధనకు కృషి చేద్దాం

ABN , First Publish Date - 2021-10-18T04:33:35+05:30 IST

ముదిరాజ్‌ల హక్కుల సాధనకు కృషి చేద్దాం

ముదిరాజ్‌ల హక్కుల సాధనకు కృషి చేద్దాం
వికారాబాద్‌: ఎన్టీఆర్‌ చౌరాస్తాలో ముదిరాజ్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముదిరాజ్‌ సంఘం సభ్యులు

  • సంఘం జిల్లా అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్‌ముదిరాజ్‌ 
  • ముదిరాజ్‌ మహాసభ స్థాపనకు వందేళ్లు.. జెండా ఆవిష్కరణ  
  • ముదిరాజ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కొరివి  కృష్ణస్వామి జయంతి సందర్భంగా ఘన నివాళి


వికారాబాద్‌/బంట్వారం/పరిగి/తాండూరు/దోమ/కొడంగల్‌: ముదిరాజుల హక్కులను సాధించే వరకు ఉద్యమిద్దామని జిల్లా ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివా్‌సముదిరాజ్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ కూడలిలో ఆదివారం ముదిరాజ్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణస్వామి ముదిరాజ్‌ చరిత్ర జన్మతహా గొప్ప నాయకత్వ లక్షణాలు మూర్తీభవించిన మహనీయుడని కొనియాడారు. కృష్ణస్వామి ముదిరాజ్‌ మొదటి నుంచి తాను పుట్టిన ముదిరాజ్‌ కులం బాగోగుల గురించే కాకుండా ఇతర పేద కులాల గురించి తపనపడే వాడని స్మరించారు. 1917లో హైదరాబాద్‌ నగరాన్ని విషజ్వరాలు పీడించినప్పుడు ఆయన నగరవాసులకి ఎనలేని సేవలు చేశాడని గుర్తుచేశారు. సోషల్‌ సర్వీస్‌ కాన్ఫరెన్స్‌ అనే సంస్థ సభ్యుడై సమాజసేవ చేశాడని తెలిపారు. ముదిరాజ్‌ బంధు మిత్రుల సమస్యల పరిష్కారానికి సూచనలు తీర్పులు చెప్పేవారన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ నిర్మించిన ముదిరాజ్‌ భవన్‌, న్యూ బోయిగూడ, సికింద్రాబాద్‌లో నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్కోడ నర్సిములు, జిల్లా ఉపాధ్యక్షుడు శాకం రాములు, నియోజకవర్గ అధ్యక్షుడు బీఆర్‌ శేఖర్‌, సీనియర్‌ నాయకుడు దుదాయల వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, శివారెడ్డిపేట్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ గడ్డమీది పాండు, నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్‌.నర్సిములు, కాకి రంగరాజు, జైదుపల్లి గ్రామ అధ్యక్షుడు జి.కిష్టయ్య, గోపాల్‌, జిల్లా లీగల్‌ అడ్వైజర్‌ దుద్యాల లక్ష్మణ్‌, రామయ్య, వెంకటయ్య, నర్సింలు, బాలనర్సిములు తదితరులు పాల్గొన్నారు. బంట్వారం బస్టాండ్‌ ఆవరణలో ముదిరాజ్‌ సంఘం శత జయంతి సందర్భంగా ముదిరాజ్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శాకం రాములు, మండలాధ్యక్షుడు యాదయ్య ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు యాదయ్య కొరివి క్రిష్ణమూర్తి ముదిరాజ్‌, నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం సంఘం జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, యూత్‌ ప్రెసిడెంట్‌ గాలిరాజు, మోహన్‌, రాజు, క్రిష్ణ, బిచ్చప్ప, వెంకటేషం పాల్గొన్నారు. పరిగిలోని ముదిరాజ్‌ భవన్‌లో ముదిరాజ్‌ సంఘం పరిగి తాలుకా అధ్యక్షుడు దోమ రాంచంద్రయ్యముదిరాజ్‌, జిల్లా కార్యదర్శి డి.మాణిక్యం, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌ముదిరాజ్‌లు జెండాను ఆవిష్కరించి, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా 54లక్షలు ఉన్న ముదిరాజ్‌లు విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలన్నారు. ముదిరాజ్‌ల హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జనాభా ప్రకారంగా హక్కులను సాధించుకుందామన్నారు. బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకుందామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు ఆర్‌.ఆంజనేయులు, ఎం.నాగేశ్వర్‌, దోమ శ్రీశైలం, కుడుముల వెంకటేశ్‌, యాదయ్య, పి.బాబయ్య, కావలి లక్ష్మీ, అనిల్‌, నాగేశ్‌, కృష్ణయ్య, నారాయణ, మొగులయ్య,వంశీ తదితరులు పాల్గొన్నారు. తాండూరులో ముదిరాజ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కొరివి కృష్ణస్వామి జయంతి, ముదిరాజ్‌ రాష్ట్ర మహాసభ స్థాపన దినోత్సవాన్ని తాండూరు ముదిరాజ్‌ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలో కృష్ణస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముదిరాజ్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహాసభ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకుని శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల కులాల అభివృద్ధికి కృష్ణస్వామి ఎంతగానో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ నాయకులు ఆకుల రాములు, కృష్ణ, లలితరాజు, నర్సింహులు, ఎస్‌పి.రవి, శ్రీకాంత్‌, అడ్వకేట్‌ అరవింద్‌, భీమశంకర్‌, రమేష్‌, హన్మంతు, శ్రీనివాస్‌, జగన్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో శ్రీకొరివి క్రిష్ణస్వామి ముదిరాజ్‌ జయంతి సందర్భంగా జెండా ఎగరవేసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముదిరాజ్‌ నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్‌ల్లో ఐక్యత చాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా యూత్‌ అధ్యక్షుడు దస్తయ్య, నాయకులు జంగయ్య, క్రిష్ణయ్య, బాబు, శేఖర్‌, నర్సింహులు, పెంటయ్య, శేఖర్‌, శ్రీనివాస్‌, యాదయ్య పాల్గొన్నారు.  కొడంగల్‌లో ముదిరాజ్‌ మహాసభ నాయకులు స్థానిక ఐబీ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు. ఈసందర్బంగా ముదిరాజ్‌ సంఘం తాలూకా అధ్యక్షుడు నర్సిములు, నాయకులు మాజీ జడ్పీ వైస్‌ చైర్మెన్‌ కృష్ణ, జడ్పీటీసీ మహిపాల్‌, మాజీ జడ్పీటీసీ కోట్లయాదగిరి, ఎంట్లమల్లయ్య, బాల్‌రాజ్‌, వెంకటయ్య తదితరులు మాట్లాడుతూ కృష్ణస్వామి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంతకు ముందు కృష్ణస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు తిరుపతయ్య, మల్లేశ్‌, బాల్‌రాజ్‌, డివి.నరేశ్‌రాజ్‌, బాబయ్యనాయుడు, నర్సప్ప, భీంశప్ప, వెంకటయ్య, రాంచందర్‌, సర్పంచ్‌ గోవింద్‌, చిన్నా, పల్లెర్లరాములు, విజయ్‌కుమార్‌, హన్మయ్య, లక్ష్మప్ప, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో రాణించాలి

ఘట్‌కేసర్‌/శామీర్‌పేట/మేడ్చల్‌: ముదిరాజ్‌లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి ముదిరాజ్‌ సంఘం నాయకులు కృషిచేయాలని ఘట్‌కేసర్‌ ముదిరాజ్‌ సంఘం నాయకులు అన్నారు. ముదిరాజ్‌సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుర్వి కృష్ణ స్వామి ముదిరాజ్‌, నవ్వాడా ముత్తయ్య ముదిరాజ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ముదిరాజ్‌ సంఘం నాయకులు మాట్లాడుతూ అమరుల ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.నరేష్‌, బర్ల హరిశంకర్‌, నాగరాజు, బాలరత్నం, వెంకటనారాయణ, రాధాకృష్ణ, నల్లవెల్లి శేఖర్‌, బర్ల దేవేందర్‌, సంజీవ, శ్రీనివాస్‌, నర్సింగ్‌రావు, బిక్షపతి, బాలయ్య పాల్గొన్నారు. శామీర్‌పేట మండల ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు కావలి శంకర్‌ ఆధ్వర్యంలో సంఘం వ్యవస్థాపకులు స్వర్గీయ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌, దాన ముత్తయ్యల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ముదిరాజుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దుర్గం వెంకటేష్‌, నాయకులు శంకర్‌, బిక్షపతి, వెంకటస్వామి, కుమార్‌, క్రిష్ణ, దేశం శేఖర్‌, రాము, సోమరాజు, హరిబాబు, సాయి, ఆగేష్‌ పాల్గొన్నారు. మేడ్చల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌, ముత్తయ్య చిత్రపటాలకు నివాళులర్పించారు. జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పలువురు వక్తలు వారి గొప్పదనాన్ని కొనియాడారు. మేడ్చల్‌ మున్సిపల్‌ 8వ వార్డు కౌన్సిలర్‌ నడికొప్పు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలమల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:33:35+05:30 IST