టీబీ అంతానికి కృషి చేద్దాం

ABN , First Publish Date - 2022-07-06T05:51:45+05:30 IST

టీబీ వ్యాధిని అంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది క్రియశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు.

టీబీ అంతానికి కృషి చేద్దాం
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 5 : టీబీ వ్యాధిని అంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది క్రియశీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నేషనల్‌ టీబీ నివారణ ప్రోగ్రాంపై జరిగిన సమావేశంలో  మాట్లాడారు. టీబీ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తోందన్నారు. ఎన్‌డీడీ కార్యక్రమం కింద 19 సంవత్సరాల లోపు పిల్లలకు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి మందులను ఇవ్వడంతోపాటు పూర్తి చికిత్స తీసుకునే కాలంలో ప్రతీ నెల రూ.500 వారి ఖాతాలో పోషణకు వేయనున్నట్లు పేర్కొన్నారు.  2025 సంవత్సరం వరకు టీబీ వ్యాధి లేకుండా చూడాడానికి వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, డిప్యూటీ డీఎం హెచ్‌వో డాక్టర్‌ రజిత, డీఐవో డాక్టర్‌ మహేష్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, డాక్టర్‌ మహేష్‌రావు, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఈవో రాధాకిషన్‌, చింతోజు భాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:51:45+05:30 IST