మార్పును ఆహ్వానిద్దాం!

ABN , First Publish Date - 2021-01-01T06:24:23+05:30 IST

మరో కొత్త సంవత్సరం వచ్చింది. మరి మిమ్మల్నీ, మీ జీవితాన్నీ మీరు కోరుకొనే విధంగా, మీకు కావలసిన విధంగా... అంటే ‘కొత్త’గా మలచుకోవాలని అనుకుంటున్నారా? ఆ అవసరం ఉందనుకుంటున్నారా? ఆ

మార్పును  ఆహ్వానిద్దాం!

మరో కొత్త సంవత్సరం వచ్చింది. మరి మిమ్మల్నీ, మీ జీవితాన్నీ మీరు కోరుకొనే విధంగా, మీకు కావలసిన విధంగా... అంటే ‘కొత్త’గా మలచుకోవాలని అనుకుంటున్నారా? ఆ అవసరం ఉందనుకుంటున్నారా? ఆ కోరిక ఉంటే... ఒక శక్తిమంతమైన ప్రక్రియను అనుసరించాలి. ఎటువంటి బాహ్య పరిస్థితినైనా ఎదుర్కోగలిగే గొప్ప అంతర్గత శక్తిని ఆ ప్రక్రియ మీకు అందిస్తుంది.


నిజానికి ఈ జీవితమే ఒక ప్రక్రియ. దీనిలో తనకంటూ ఒక వ్యక్తిత్వాన్నీ, ఒక నిర్దిష్టమైన ప్రతిరూపాన్నీ ప్రతి మనిషీ సృష్టించుకుంటాడు. అలా సృష్టించుకొనే ఆ ప్రక్రియకు వాస్తవికతతో చాలా సందర్భాల్లో సంబంధం ఉండదు. అలాగే ఆ ప్రతిరూపానికీ. మీ అంతర్గత స్వభావానికీ కూడా సంబంధం ఉండదు. అది చాలా సార్లు మీకు తెలియకుండానే మీరు సృష్టించుకున్న ఒక ప్రతిరూపం. చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే తమ ప్రతిరూపాన్ని చేతనాత్మకంగా తమ ప్రతిరూపాన్ని సృష్టించుకుంటారు. మిగిలినవారు అచేతనంగా, తమతమ బాహ్యపరిస్థితుల రీత్యా, తమతమ ధోరణులను రీత్యా దాన్ని తయారు చేసుకుంటారు. 


అయితే, మనం ఈ ప్రతిరూపాన్ని పూర్తి స్పృహతో, మనకు కావలసినట్టు, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా... ఎందుకు సృష్టించుకోకూడదు? మీకు తగిన తెలివి తేటలు ఉంటే, మీరు తగినంత చేతనతో ఉంటే... మీ ప్రతిరూపాన్ని మీకు ఎలా కావాలంటే అలా... అంటే పూర్తిగా ఒక కొత్త ప్రతిరూపాన్ని సృష్టించుకోవచ్చు. ఇది పూర్తిగా సాధ్యమే! కానీ దీని కోసం మీరు ‘పాత’ను వదిలెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. కొత్తదనాన్ని ఆహ్వానించినప్పుడు ఇది తప్పనిసరి.


నిజంగా మీరు ఎవరో, మీరు ఎలా మారాలనుకుంటున్నారో, ప్రపంచానికి మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారో ఆలోచించండి. లోకం ముందు నటించకండి. మీ అంతర్గత స్వభావం ఎలాంటిదో దానికి దగ్గరగా మీ ప్రతిరూపాన్ని సృష్టించుకోండి. మరి ఆ ప్రతిరూపం ఎలా ఉండాలనుకుంటున్నారు? అది చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా, తక్కువ సంఘర్షణతో ఉండే ఒక రూపం. మన అంతర్గత స్వభావం ఎలాంటిది? అది నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ చాలా శక్తిమంతమైనది.  మన ఆలోచనలకూ, ఊహలకు తగిన శక్తి ఉంటే, ఆ శక్తిని సక్రమంగా వినియోగించుకుంటే అవి మన కర్మబంధనాలను సైతం తెంచగలవు. 


మీరు కొత్తగా మారాలంటే... మీలో ఉన్న స్థూలమైన అంశాలను, అంటే మీ పరిమితులను తొలగించుకోవాలి. మీ కొత్త ప్రతిరూపం ఎలా ఉండాలో ఆలోచించుకోండి. మీ ఆలోచనలూ, భావేద్వేగాల ప్రాథమిక స్వభావం ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. అది మునుపటికంటే మెరుగైనదా? కాదా? అని పరిశీలించుకోండి. మీరు కోరుకొనే కొత్తదనం పాతదానికన్నా ప్రమాదంగా ఉంటే ప్రయోజనం లేదు. అందుకే నిర్ణయం తీసుకోవడానికి ముందు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోండి.


అందుకోసం ప్రశాంతమైన సమయాన్ని ఎంచుకోండి. విశ్రాంతిగా కూర్చోండి. మీలో మీరు కోరుకుంటున్న మార్పులేమిటో గుర్తుచేసుకోండి. ఒక సరికొత్త వ్యక్తిని ఊహించుకోండి. ఆ కొత్త ప్రతిరూపం ఎక్కువ మానవత్వంతో, ఎక్కువ సమర్థతతో, మరింత ఎక్కువ ప్రేమపూరితంగా ఉందా? అనేది చూడండి. మీరు కోరుకున్న కొత్తదనం దానిలో కనిపిస్తే ఆ ఊహను మరింత బలోపేతం చేయండి. మీలో సజీవం చేయండి. ఆ కొత్తదనం మీ ఆలోచనల, భావోద్వేగాల, మీరు చేయగలిగే పనుల పరిమితులను దాటేదిగా ఉండాలి. అలాంటి మార్పుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం.


కరోనా మహమ్మారి దేశమంతటా వ్యాపించడంతో, మనం ఇప్పుడు సంధి కాలంలో ఉన్నాం. మహమ్మారి తరువాత, ఈ దేశ నిర్మాణం కోసం మన కార్యాచరణ ఏకాగ్రతతో, ఉద్ధృతంగా ఉండాలి. మనది ‘అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం’ అని అర్థం చేసుకోవాలి. అంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా యువతలో కోరుకున్న ఉద్యోగం కోసం ఎదురుచూసే మనస్తత్వం పోవాలి.


మన సమాజంలోని సమస్యలపై వారు దృష్టి సారించాలి. ఆ సమస్యలకు పరిష్కారం అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలు చెయ్యాలి. దేశం కోసం అద్భుతమైన అవకాశాలను సృష్టించాలి. మీ నైపుణ్యం మీదా, మీ పట్టుదల మీదా, స్ఫూర్తిదాయకమైన మీ పనితీరు మీద దేశ భవితవ్యం ఆధారపడి ఉంది. 138 కోట్ల మంది ప్రజల కలల్ని మనం సాకారం చేయాలనుకుంటే... దానికి ఇదే సరైన సమయం. దానికోసం సంకల్పం చేసుకుంటూ కొత్త ఏడాదిని ఆహ్వానిద్దాం.



మీలో మీరు కోరుకుంటున్న మార్పులేమిటో గుర్తుచేసుకోండి. ఒక సరికొత్త వ్యక్తిని ఊహించుకోండి. ఆ కొత్త ప్రతిరూపం ఎక్కువ మానవత్వంతో, ఎక్కువ సమర్థతతో, మరింత ఎక్కువ ప్రేమపూరితంగా ఉందా? అనేది చూడండి. మీరు కోరుకున్న కొత్తదనం దానిలో కనిపిస్తే ఆ ఊహను మరింత బలోపేతం చేయండి. మీలో సజీవం చేయండి. ఆ కొత్తదనం మీ ఆలోచనల, భావోద్వేగాల, మీరు చేయగలిగే పనుల పరిమితులను దాటేదిగా ఉండాలి. అలాంటి మార్పుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం.


 సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2021-01-01T06:24:23+05:30 IST