ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం

ABN , First Publish Date - 2021-05-11T04:30:52+05:30 IST

ప్రభుత్వ రంగ పరిరక్షణ దేశ రక్షణకు ఎంతో ఉపయోగమని, అటువంటి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు అన్నారు.

ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం
దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న దృశ్యం

బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేత వెంకటరావు 

సిరిపురం, మే 10: ప్రభుత్వ రంగ పరిరక్షణ దేశ రక్షణకు ఎంతో ఉపయోగమని, అటువంటి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణను కోరుతూ జీవీఎంసీ గాంధీ విగహ్రం వద్ద కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి 39వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఒకప్పుడు కాల్‌ట్యాక్స్‌, పెట్రోల్‌ ఉత్పత్తి ప్రైవేట్‌ పరిశ్రమ ఉండేదని, మనకు విదేశాలతో యుద్ధం జరిగేటప్పుడు పెట్రోల్‌ ఇవ్వకపోతే అప్పుడు ప్రభుత్వం దాన్ని జాతీయం చేసి హెచ్‌పీసీఎల్‌గా మార్చడం జరిగిందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు, దేశ రక్షణకు ప్రభుత్వరంగ సంస్థలు ఉపయోగపడతాయన్నారు. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం యుఠా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T04:30:52+05:30 IST