
మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు ఆయన వెళ్లనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తామని గతంలోనే ప్రకటించారు. తాజా సమాచారం ఏంటంటే... ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించి, సెట్స్ మీదకు వెళతారట. దీనికి ‘ధృవ’ మాతృక, తమిళ చిత్రం ‘తని ఒరువన్’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. కొన్ని రోజులు ఈ సినిమా చిత్రీకరణ చేశాక... ఫిబ్రవరిలో ‘వేదాళం’ రీమేక్‌ను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని చిరంజీవి భావిస్తున్నారట.