ప్రజలకు అన్యాయం చేస్తే అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2021-06-21T06:39:22+05:30 IST

ఊరికోసం మంచి చేస్తే సహకరిస్తాం... అన్యా యం చేయాలని చూస్తే అడ్డుకుంటామని నియోజకవర్గ టీడీపీ ఇనచా ర్జ్‌ వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

ప్రజలకు అన్యాయం చేస్తే అడ్డుకుంటాం

- రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదు..

- మాజీ ఎమ్మెల్యే కందికుంట 

కదిరి, జూన 20: ఊరికోసం మంచి చేస్తే సహకరిస్తాం... అన్యా యం చేయాలని చూస్తే అడ్డుకుంటామని  నియోజకవర్గ టీడీపీ ఇనచా ర్జ్‌  వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణకు మేము వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు పరిహారం ప్రకటిం చి, ప్రజల ఒప్పందం మేరకే విస్తరణ జరగాలన్నారు. ప్రజలకు సమాచా రం లేకుండా పట్టణంలో ప్రభుత్వాసుపత్రి, నామాలాడ్జ్‌ వద్ద ఆక్రమణ లు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.  అఖిలపక్షాన్ని పిలిచి సలహాలు తీసుకున్న అధికా రులు, ప్రస్తుతం ఆ సలహాలు పట్టించుకోకపోవడం లేదన్నారు. నిర్వాసి తులు టీడీఆర్‌ ఆమోదం తెలిపితే ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉం టుందన్నారు. అవేవి పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదన్నారు. వేమారెడ్డి సర్కిల్‌ నుంచి చావిడి వరకు 60 అడుగులు వేస్తామన్న అధికారులు, మాతో తెలిపినప్పుడు స్వాగతించామన్నారు. అయితే ఇప్పు డు ముందస్తు సమాచారం లేకుండా ఉన్నఫలంగా అధికారులు నిన్నటి దినం వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. నిజాంవలి కాలనీలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, ఇదే విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. పట్టణంలో రోడ్డులు మరమ్మతులు చేయక పోవడం సిగ్గుచేటన్నారు.   మరికొమ్మదిన్నెలో డీకేటీ పత్రాల ద్వారా రైతు లకు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగిందని, అయితే వ్యవసాయం చేస్తు న్న రైతుల దగ్గరకు వెళ్ళి తహసీల్దార్‌ నోటీసులు జారీ చేసి, వ్యవ సాయం చేయ కూడదని పేర్కొనడం ఎంత వరకు సమంజసమన్నారు. 2700 ఎకరాలు పైన అధికార పార్టీ నాయకుల కన్ను పడిందన్నారు. రైతులకు అన్యా యం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకుని అభివృద్ధికి పాటుపడాలని హితవు పలి కారు. ఈ కార్య క్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోపూరిశెట్టి చం ద్రశేఖర్‌, రాజ శేఖర్‌బాబు, డైమండ్‌ ఇర్ఫాన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T06:39:22+05:30 IST