బాలికలకు తోడ్పాటు అందిద్దాం

ABN , First Publish Date - 2022-01-25T04:58:41+05:30 IST

సమాజంలో స్వశక్తితో బాలికలు ఎదగడానికి కావాల్సిన తోడ్పాటు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత అన్నారు.

బాలికలకు తోడ్పాటు అందిద్దాం
వనపర్తి బాలల సంరక్షణ సమితి కార్యాలయంలో బాలికల రక్షణపై ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు

- జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత

- ఘనంగా బాలికల దినోత్సవం 


వనపర్తి టౌన్‌, జనవరి 24 : సమాజంలో స్వశక్తితో బాలికలు ఎదగడానికి కావాల్సిన తోడ్పాటు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలల సం రక్షణ సమితి కార్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళ శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్‌లైన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. బాలికలు సరై న లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించ డానికి కృషి చేయాలన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను, బాల్య వివాహాల నిర్మూలన కో సం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాలికల ను రక్షిద్దాం.. చదివిద్దామనే నినాదంతో ముందుకు సాగాలని కోరారు. అనంతరం బాలికల రక్షణపై ప్ర తిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ అలివేలమ్మ, బాలరక్ష భవన్‌ కోఆర్డినేటర్‌ కృష్ణచైతన్య, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు, ఎస్‌వీకే డైరెక్టర్‌ లక్ష్మణ్‌రావు, గిరిజాప్రీతి, వనజ, నళిని, విజయ్‌కుమార్‌, సురేందర్‌, నాగలక్ష్మి, శైలజ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. 

 కొత్తకోట : మండలంలోని కనిమెట్ట గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో బాలికల దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి గా ఎంపీపీ గుంత మౌనిక హాజరై, మాట్లాడారు. ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని, వారి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇంట్లో ఒక్క ఆడపిల్ల చదువుకుంటే ఇంట్లోని వారందరూ చదువు కున్నట్లేనన్నారు. ఆడపిల్లలను పుట్టనిద్దామని, బతుక నిద్దామని, చదవనిద్దాం.. ఎదగనిద్దామని వివరించా రు. కార్యక్రమంలో సర్పంచ్‌ గాధంరాణి, వైస్‌ ఎంపీపీ శ్రీనువాసులు అంగన్‌వాడీ టీచర్లు తిరుమలేశ్వరి, సు వర్ణ, వార్డు సభ్యులు పరుశరాములు, సురేష్‌యాద వ్‌, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-25T04:58:41+05:30 IST