పరీక్షల్లో ఇలా రాద్దాం!

ABN , First Publish Date - 2020-03-10T06:37:05+05:30 IST

పరీక్షల్లో సమాధానాలు ఒక ప్రవాహంలా వెళుతుంటాయి. అలా రాయడం వల్ల ముఖ్యమైన అంశాలు కొన్ని ఎగ్జామినర్ల దృష్టిలో పడకపోవచ్చు. అందువల్ల ముఖ్యమైన అంశాలు వారి దృష్టిలో....

పరీక్షల్లో ఇలా రాద్దాం!

పరీక్షల్లో సమాధానాలు ఒక ప్రవాహంలా వెళుతుంటాయి. అలా రాయడం వల్ల ముఖ్యమైన అంశాలు కొన్ని ఎగ్జామినర్ల దృష్టిలో పడకపోవచ్చు. అందువల్ల ముఖ్యమైన అంశాలు వారి దృష్టిలో పడటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. అలాంటి వాటిలో ముఖ్యంగా....

ముఖ్యమైన అంశం కింద అండర్‌లైన్‌ చేయడం ఒకటి. పిల్లలందరూ ఒకే లా రాస్తారు అనే భావన కొంతమంది ఎగ్జామినర్లలో సహజంగానే ఉంటుంది. అయితే, అండర్‌లైన్‌ చేయడం ద్వారా ఆ భావనకు తావు లేకుండా చేయవచ్చు.  

అండర్‌లైన్‌ చేయడానికి వీలైతే కలర్‌ పెన్స్‌ వాడవచ్చు. లేదంటే మామూలుగా రాస్తున్న బ్లాక్‌ లేదా బ్లూ పెన్‌తోనే అండర్‌లైన్‌ చేయాలి. 

ప్రతి ఆన్సర్‌నూ కొన్ని సబ్‌హెడింగ్‌లుగా (ఉపశీర్షిక) విడదీయడం కూడా అంతే ముఖ్యం. 

వేర్వేరు అంశాలను ఒకే పేరాగ్రాఫ్‌లో ప్రస్తావించడం వల్ల ఒక్కోసారి అవి ఎగ్జామినర్‌ దృష్టిలో పడవు. అందువల్ల ప్రతి కొత్త విషయాన్నీ  ఒక  కొత్త సబ్‌హెడింగ్‌ పెట్టడం ఎక్కువ ప్రయోజనకరం. 

సబ్‌హెడింగ్స్‌ మధ్యలో కూడా ముఖ్యమైన అంశాలు వస్తే అక్కడ కూడా అండర్‌లైన్‌ చేయాలి. 

జవాబులకు సంబంధించిన బొమ్మలు వేయడంలో ఎప్పుడూ అలక్ష్యం చేయకూడదు. నిజానికి ఒక పెద్ద పేరాగ్రాఫ్‌ రాస్తే వచ్చే వాటికన్నా ఎక్కువ మార్కులు ఒక్క డయాగ్రమ్‌ తెచ్చిపెడుతుంది. 

వాక్యం మధ్యలో అండర్‌లైన్‌ చేయడం ఒక పద్ధతైతే, వాక్యం ప్రారంభంలోనే నక్షత్రం గుర్తు పెట్టడం మరో పద్ధతి. ఇది కూడా ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయడానికి తోడ్పడుతుంది. 

అండర్‌లైన్‌ చేయడం, నక్షత్రం గుర్తు పెట్టడం వంటి అలవాటు ముందే  లేనప్పుడు ఆన్సర్‌ షీట్‌లోనే అలా చేయాలంటే గుర్తుకు రాకపోవచ్చు. అందువల్ల  ఇంటి వద్ద ఉన్నప్పుడే అప్పుడప్పుడు ప్రాక్టీస్‌ చేయాలి.

Updated Date - 2020-03-10T06:37:05+05:30 IST