ఎగ్జిబిషన్‌ సొసైటీలో అక్రమాలపై మే 25న సీఎంకు అందిన లేఖ

ABN , First Publish Date - 2021-07-04T00:10:01+05:30 IST

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో జరుగతున్న అక్రమాలపై మే 25న సీఎం కేసీఆర్‌కు

ఎగ్జిబిషన్‌ సొసైటీలో అక్రమాలపై మే 25న సీఎంకు అందిన లేఖ

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో జరుగతున్న అక్రమాలపై మే 25న సీఎం కేసీఆర్‌కు లాల్‌బహదూర్ కాలేజ్ మాజీ సెక్రటరీ రవీంద్ర సేన రవీంద్రసేన లేఖ రాశారు. నాంపల్లి సొసైటీ చైర్మన్, సెక్రటరీలను సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్‌కు రవీంద్ర సేన లేఖ రాశారు. 2018లో ఈటల నితిన్‌తో పాటు 62 మందికి ఏకపక్షంగా సభ్యత్వాలు ఇచ్చారని రవీంద్ర సేన ఆ లేఖలో పేర్కొన్నారు. సొసైటీ ఆదాయాన్ని సభ్యులంతా ఇష్టం వచ్చినట్టు పంచుకున్నారని రవీంద్ర ఆరోపించారు. ఓ ఫార్మసీ కాలేజీ నుంచి అక్రమంగా 78 లక్షలు సొసైటీకి మళ్లించారని ఆయన పేర్కొన్నారు. సొసైటీలో ఆడిట్‌ సరిగా జరగలేదన్నారు. అనవసర ఖర్చులు చేశారన్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు తన సభ్యత్వాన్ని రద్దు చేశారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రవీంద్ర సేన ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-04T00:10:01+05:30 IST