విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయం

ABN , First Publish Date - 2022-01-25T05:39:00+05:30 IST

గ్రామీణ విద్యార్థులకు విద్యాభివృద్ధిలో తోడ్పాటును అందించే దిశగా కృషి చేయడం అభినందనీయమని జడ్పీటీసీ కస్తూరిరెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయం
నగదు అందజేస్తున్న జడ్పీటీసీ కస్తూరి రెడ్డి, చైర్మన్‌ గఫార్‌

కనిగిరి, జనవరి 24: గ్రామీణ విద్యార్థులకు విద్యాభివృద్ధిలో తోడ్పాటును అందించే దిశగా కృషి చేయడం అభినందనీయమని జడ్పీటీసీ కస్తూరిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తాళ్లూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతే కాకుండా మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకొనే పేద మెరిట్‌ విద్యార్థులకు రిటైర్డ్‌ హెచ్‌ఎం మస్తాన్‌వలి ఆర్థిక సహకారం అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. సామాజిక సేవలో భాగంగా ఇలాంటి వారు మందుకు వచ్చి విద్యార్థులకు చేయూతను అందించడం వారికి వరం లాంటిదన్నారు. దాత రిటైర్డ్‌ హెచ్‌ఎం మస్తాన్‌వలి మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి  ఏటా వారికి ఆర్థిక సహకారం అందిస్తున్నామన్నారు.  ఆ సహకారంతో ఏ విద్యార్థైనా ఉన్నతస్థితిలోకి వెళ్తే వారు కూడా ఇదే పాఠశాల్లో చదివే మరో ఇద్దరికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, కనిగిరి నగర పంచాయతీ చైర్మన్‌షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ చేతుల మీదుగా తాళ్ళూరు హైస్కూల్‌ల్లో చదివి ఐఐటీలో సీట్లు సాధించిన బాలికలు దుర్గ, అంజలి అనే బాలికలకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ. 10వేలు వంతున ఆరేళ్ళపాటు ఆర్దిక సహకారాన్ని అందించడంలో భాగంగా ఈ ఏడాది రూ. 20వేలను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు దేవిరెడ్డి రామిరెడ్డి, మాజీ సర్పంచ్‌ ఈశ్వరమ్మ, ఉపాధ్యాయులు కోటిరెడ్డి, బాలయ్య, ఈశ్వర్‌రెడ్డి, నాయబ్‌ రసూల్‌, శ్రీనివాసులు, గుడ్‌హెల్‌ రమేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:39:00+05:30 IST