
న్యూడిల్లీ: దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను తగ్గించాలని జర్మనీ వాహన దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భారత ప్రభుత్వాన్ని కోరింది. విదేశాలతో పోల్చుకుంటే భారతీయులు కార్లను కొనుగోలు చేయడానికి రెండింతలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పింది. టెస్లాకు సుంకాలు మాఫీ చేసి తమకు మాఫీ చేయకపోవడం దారుణామని వివరించింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ.మార్టిన్ స్క్వానెక్ భారత్‌లో సుంకాలు చాలా అధికంగా ఉన్నాయన్నారు. కార్ల విక్రయాలు పెరగాలంటే తప్పకుండా దిగుమతి సుంకాలను తగ్గించాలన్నారు. దేశంలో కార్ల విక్రయాలు తక్కువగా ఉండటంతో కొత్త టెక్నాలజీని ఇక్కడికి బదిలీ చేయలేయమన్నారు. సుంకాలు చాలా అధికంగా ఉండటంతో కస్టమర్లు కార్లను కొనుగోలు చేయలేకపోతున్నారని వివరించారు. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా అన్ని రకాల హై ఎండ్ టెక్నాలజీ లగ్జరీ కార్లపై సుంకాలను తగ్గించాలన్నారు.
గతంలో టెస్లా కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్‌కు లేఖ రాయడంతో ఆ సంస్థకు భారత ప్రభుత్వం సుంకాలను మాఫీ చేసింది. 40వేల అమెరికన్ డాలర్ల కన్నా అధిక విలువ కలిగిన కార్లపై 110 శాతం సుంకాలు ఉంటే వాటిని రద్దు చేసింది. కానీ, ఆ సంస్థ అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలను 40శాతానికి పరిమితం చేయాలని చెప్పింది. సోషల్ వెల్ఫేర్ సర్ ఛార్జీ 10శాతంగా ఉంటే దానిని పూర్తిగా రద్దు చేయాలని కోరింది.