ఫోన్‌లకు ఎల్‌జీ గుడ్‌బై

ABN , First Publish Date - 2021-04-10T06:00:09+05:30 IST

స్మార్ట్‌ ఫోన్ల బిజినెస్‌ నుంచి ఎల్‌జీ కంపెనీ తప్పుకొంటోంది. మార్కెట్‌ పోటీలో నిలబడలేక స్మార్ట్‌ఫోన్ల బిజినెస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది

ఫోన్‌లకు ఎల్‌జీ గుడ్‌బై

స్మార్ట్‌ ఫోన్ల బిజినెస్‌ నుంచి ఎల్‌జీ కంపెనీ తప్పుకొంటోంది. మార్కెట్‌ పోటీలో నిలబడలేక  స్మార్ట్‌ఫోన్ల బిజినెస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అయితే కొన్ని ముఖ్య సందేహాలకు కంపెనీ ప్రతినిధులు అధికారికంగా ఇచ్చిన సమాధానాలు  వినియోగదారులను ఊరడించేలా ఉన్నాయి.

  • విక్రేతల వద్ద ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఎప్పటికప్పుడు నియంత్రణలకు లోబడి ఔస్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ చేస్తారు.
  • కస్టమర్‌ సర్వీస్‌ అందుబాటులో ఉంటుంది. నిరంతరాయంగా సేవలు అందిస్తుంది. ఎల్‌జీ టోన్‌ ఫ్రీ, వైర్‌లెస్‌ బ్లూటూత్‌ స్పీకర్లను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫోన్లు, టాబ్లెట్‌ పీసీలను స్టాక్‌ ఉన్నంత మేరకు అమ్ముతారు. 
  • అవసరమైన బ్యాటరీ, చార్జర్‌, కేబుల్‌, హెడ్‌సెట్స్‌ వంటివన్నీ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా సర్వీస్‌ పార్టులూ ఉంటాయి. 
  • ఆండ్రాయిడ్‌ 11 ఔస్‌ అప్‌గ్రేడేషన్‌ ఇప్పుడు జరుగుతోంది. ఆండ్రాయిడ్‌ 12 ఔస్‌ అప్‌గ్రేడేషన్‌ అయి ముందుకు రానుంది. గూగుల్‌ ఔస్‌  డిస్ట్రిబ్యూషన్‌ షెడ్యూల్‌ ప్రకారం అప్‌గ్రేడ్‌ ప్లానుల్లో మార్పులు ఉండవచ్చు.  ఔస్‌ అప్‌గ్రేడ్‌లకు సంబంధించి స్థానికంగా ఉన్న కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లను సంప్రతించవచ్చు. సెక్యూరిటీ, క్వాలిటీ స్టెబిలైజేషన్‌ అప్‌డేట్‌లను నిరంతరంగా కొనసాగిస్తారు.  
  • మెయింట్‌నెన్స్‌ జరుగుతున్నంత కాలం, సర్వర్‌, అకౌంట్‌ బేస్డ్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎల్‌జీ అలాగే భాగస్వామ వ్యాపారులు వివిధ యాప్స్‌ అప్‌డేట్స్‌కు సంబంధించిన సేవలు అందిస్తాయి.
  • గూగుల్స్‌ ప్లే అలాగే యాపిల్‌కు చెందిన యాప్‌ స్టోర్‌లో ‘ఎల్‌జీ థిన్‌క్యూ’ యాప్‌ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. యూజర్ల పర్సనల్‌ సమాచారాన్ని రిటెన్షన్‌ పీరియడ్‌లో భద్రంగా ఉంచుతారు. తదుపరి దాన్ని పూర్తిగా నాశనం చేస్తారు.

Updated Date - 2021-04-10T06:00:09+05:30 IST