ఎల్‌జీ.. రోలబుల్‌ టీవీ ధర రూ.75 లక్షలు

Published: Sat, 25 Jun 2022 03:52:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రపంచంలో మొట్టమొదటి రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీ4వీని ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చింది. 65 అంగుళాలు ఉండే ‘ఎల్‌జీ సిగ్నేచర్‌ ఓఎల్‌ఈడీ ఆర్‌’ టీవీ ధర రూ.75 లక్షలు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న ‘ఆడియో అండ్‌ బియాండ్‌’లో ఈ టీవీలను విక్రయిస్తారు. టీవీ అవసరమైనప్పుడు బయటకు వచ్చి.. తర్వాత రోలవుతూ లోనికి వెళుతుంది. నగరాల్లోని ధనిక వర్గాల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధిపతి గిరీశన్‌ గోపి తెలిపారు. సెల్ఫ్‌-లైటింగ్‌ పిక్సెల్‌ టెక్నాలజీ, ఇండివిడ్యువల్‌ డిమ్మింగ్‌ కంట్రోల్‌ వంటి టెక్నాలజీలతో దీన్ని రూపొందించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.