LGBTQ Community Vs Monkeypox : పురుషులతో లైంగిక చర్యలు చేసే పురుషుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-30T17:45:56+05:30 IST

హెచ్ఐవీ/ఎయిడ్స్ (HIV/AIDS) ప్రారంభంలో పరిస్థితులు LGBTQ

LGBTQ Community Vs Monkeypox : పురుషులతో లైంగిక చర్యలు చేసే పురుషుల ఆందోళన

లాస్ ఏంజిల్స్ : హెచ్ఐవీ/ఎయిడ్స్ (HIV/AIDS) ప్రారంభంలో పరిస్థితులు LGBTQ Communityకి మళ్లీ ఎదురవుతున్నాయి. ఈసారి మంకీపాక్స్ రూపంలో వీరిని భయాందోళనలు వెంటాడుతున్నాయి. పురుషులతో లైంగిక చర్యలు చేసే పురుషులకు మంకీపాక్స్ సోకుతుందనే ప్రచారంతో వీరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసౌకర్యంగా ఉండే ప్రశ్నలను ఎదుర్కొంటుండటంతో వీరిలో ఆగ్రహం పెరిగిపోతోంది. 


మంకీపాక్స్ లక్షణాలు (Monkeypox Symptoms), దాని స్వభావం, అది ఏ విధంగా వ్యాపిస్తుంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అమెరికాలో ఈ వ్యాధి సోకినవారిలో అత్యధికులు LGBTQ వ్యక్తులు, పురుషులు అని వెల్లడైంది. ఎనభయ్యో దశకంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ వల్ల ఈ వర్గం వ్యక్తులు ఏ విధంగా కళంకానికి గురయ్యారో, అవే పరిస్థితులు ప్రస్తుతం వీరికి ఎదురవుతున్నాయి. అప్పట్లో ఆసుపత్రులు, శ్మశాన వాటికల్లోకి హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులను, బాధితులను రానిచ్చేవారు కాదు. 


లాస్ ఏంజిల్స్ LGBTQ communityకి కేంద్రం వంటి వెస్ట్ హాలీవుడ్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో యాక్టర్ మట్ ఫోర్డ్‌ (Mutt Ford)కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. మంకీపాక్స్ సోకడంతో తాను అత్యంత బాధాకరమైన లక్షణాలను ఎదుర్కొన్నానని ఆయన బహిరంగంగా చెప్పినందుకు ఈ గౌరవం దక్కింది. తన అనుభవం గురించి బహిరంగంగా మాట్లాడే ముందు తాను సందేహించానని చెప్పారు. తాను తన పరిస్థితి గురించి ట్వీట్ చేయడానికి ముందు తటపటాయించానని చెప్పారు. సామాజిక కళంకం, ముఖ్యంగా ఇంటర్నెట్‌లో జనాలు చాలా క్రూరంగా వ్యవహరిస్తారనే కారణాలతో తాను సందేహించానని తెలిపారు. అయితే స్పందన చాలా వరకు పాజిటివ్ (సకారాత్మకం)గానే వచ్చిందన్నారు. 


ఫోర్డ్‌ బాహాటంగా మాట్లాడటానికి కారణం ఏమిటంటే, వెస్ట్ హాలీవుడ్‌లో LGBTQ Pride celebrations పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఆ సమయంలో ఇతరులు ఈ వ్యాధితో బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ముందడుగు వేశారు. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా

ఇదిలావుండగా, మంకీపాక్స్ లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపిస్తుందని ఇంత వరకు స్పష్టత లేదు. అయితే ఈ వ్యాధి బారిన పడుతున్నవారిలో ఎక్కువ మంది పురుషులతో సెక్స్ చేసే పురుషులు కావడం గమనార్హం.  శారీరక సంబంధాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తోందని, సెక్సువల్ యాక్టివిటీ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. గే, బైసెక్సువల్ పురుషులు తమ సెక్సువల్ పార్టనర్స్‌ను పరిమితం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల కోరింది. 


అమెరికా ప్రభుత్వంపై విమర్శలు

మంకీపాక్స్ వ్యాధి పట్ల అమెరికా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. అమెరికాలో 4,900 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీనికి తగినట్లుగా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే అదనంగా 7.86 లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ స్పందన చాలా ఆలస్యంగా వచ్చిందని చాలా మంది విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అవసరమైనంత వేగంగా పని చేయడం లేదని LGTBQ ఉద్యమకారులు, సంస్థలు ఆరోపిస్తున్నాయి. 


వెస్ట్ హాలీవుడ్‌లో జరిగిన సమావేశంలో లాస్ ఏంజిల్స్ కౌంటీ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆండ్రియా కిమ్ మాట్లాడుతూ, మొబైల్ మంకీపాక్స్ ఇమ్యునైజేషన్ యూనిట్ త్వరలో వస్తుందని చెప్పారు. 


Updated Date - 2022-07-30T17:45:56+05:30 IST