కేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్‌ ఆగ్రహం

Dec 7 2021 @ 22:28PM
భోజనం పరిశీలిస్తున్న చైర్మన్‌ యాదవ్‌రావ్‌

జైనూర్‌, డిసెంబరు 7: మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌ సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాలయంలో మెనూ అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని సిబ్బందిపై మండి పడ్డారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌, నాయకులు రాథోడ్‌ రాందాస్‌ ఉన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.