కార్పొరేట్లకు ఎల్‌ఐసీ అమ్మకం హానికరం

ABN , First Publish Date - 2022-01-20T05:26:54+05:30 IST

దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అమ్మేయడం హానికరమని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గుంటూరు యూనిట్‌ కార్యదర్శి శివరామకృష్ణారావు తెలిపారు.

కార్పొరేట్లకు ఎల్‌ఐసీ అమ్మకం హానికరం
లక్ష్మీపురంలో జరిగిన ఎల్‌ఐసీ పరిరక్షణ దినంలో పాల్గొన్న ఉద్యోగులు

గుంటూరు(తూర్పు), జనవరి 19: దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ  సంస్థలను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అమ్మేయడం హానికరమని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గుంటూరు యూనిట్‌ కార్యదర్శి శివరామకృష్ణారావు తెలిపారు. ఎల్‌ఐసీ కార్యలయాల వద్ద బుధవారం ఎల్‌ఐసీ పరిరక్షణ దినం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాక్‌ మార్కెట్‌లో కుంభకోణాలు  చోటు చేసుకుంటున్న సమయంలో ఎల్‌ఐసీ లిస్టింగ్‌  నిర్ణయం సరైంది కాదన్నారు. ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమానికే అనే నినాదానికి కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పీవీ రమణ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన ఎల్‌ఐసీ నిధులపై విదేశి కంపెనీల పట్టు పెరిగితే మన ఆర్థిక స్వావలంబన ప్రమాదంలో పడుతుందన్నారు.   కార్యక్రమంలో డివిజనల్‌ సంయుక్త కార్యదర్శి వీవీకే సురేష్‌, బంగారుబాబు, వెంకట్రావు, ఉషాబాల, శ్రీదేవి, పద్మావతి, శ్రీనివాస్‌, ప్రసాద్‌, రాజేశ్వరరావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-20T05:26:54+05:30 IST