LIC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.80 వేల కోట్లు క్షీణత

ABN , First Publish Date - 2022-05-28T03:40:12+05:30 IST

బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.80 వేల కోట్లకుపైగా క్షీణించింది.

LIC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.80 వేల కోట్లు క్షీణత

న్యూఢిల్లీ : బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ(LIC) పబ్లిక్ ఇష్యూ అనంతరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.80 వేల కోట్లకుపైగా పతనమైంది. ఇష్యూ ప్రైస్ రూ.949 ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.6,00,242 కోట్లుగా ఉంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా లిస్టింగ్ సమయంలో విలువ రూ.5,57,675 కోట్లకు తగ్గిపోయింది. కాగా లిస్టింగ్ రోజు నుంచి శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయానికి మరింత తగ్గి రూ.5,19,630 కోట్లుగా పడిపోయింది. అంటే ఇష్యూ సైజు నుంచి మొత్తం రూ.80,600 కోట్ల మేర నష్టపోయినట్టయింది. శుక్రవారం నాటికి ఇష్యూ ప్రైస్ కంటే 13.5 శాతం నష్టంతో రూ.821.55 వద్ద ఎల్‌ఐసీ షేర్లు ముగిశాయి. కాగా లిస్టింగ్ ప్రైస్‌తో పోల్చితే 5.2 శాతం మేర దిగజారాయి. ఎల్‌ఐసీ గరిష్ఠంగా రూ.920, కనిష్ఠంగా రూ.801.55 మార్క్‌ మధ్య ట్రేడింగ్ జరిగింది.

Updated Date - 2022-05-28T03:40:12+05:30 IST