'లెఫ్టినెంట్ రామ్' ఫస్ట్ గ్లిమ్స్ విడుదల

Jul 28 2021 @ 11:43AM

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'లెఫ్టినెంట్ రామ్' సినిమా నుంచి తాజాగా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేసింది చిత్ర బృందం. 'మహానటి' మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన దుల్కర్‌కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన హీరోగా 'మహానటి' నిర్మాతలు స్ట్రెయిట్ తెలుగు సినిమా నిర్మిస్తున్నారు. 'అందాల రాక్షసి', 'పడి పడి లేచే మనసు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గురింపు తెచ్చుకున్న హను రాఘవపూడి 'లెఫ్టినెంట్ రామ్' మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లెఫ్టినెంట్ రామ్.. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అని రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. కాగా నేడు ( జూలై 28 ) దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ ఫస్ట్ గ్లింస్ వదిలారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.7 గా, వైజయంతీ మూవీస్ సమర్పణలో ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఇందులో నటించే హీరోయిన్‌ను ప్రకటించనున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.