పొల్లూరు మూడో యూనిట్‌కు లైఫ్‌ ఎనాలసిస్‌ టెస్టులు Life Analysis Tests for Pollur Third Unit

ABN , First Publish Date - 2021-07-27T05:51:46+05:30 IST

సీలేరు కాంప్లెక్సు పరిధిలో పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో మూడో యూనిట్‌కు లైఫ్‌ ఎనాలసిస్‌ టెస్టులను నిర్వహిస్తున్నట్టు చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు తెలిపారు.

పొల్లూరు మూడో యూనిట్‌కు లైఫ్‌ ఎనాలసిస్‌ టెస్టులు Life Analysis Tests for Pollur Third Unit


సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు 


సీలేరు, జూలై 26: సీలేరు కాంప్లెక్సు పరిధిలో పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో మూడో యూనిట్‌కు లైఫ్‌ ఎనాలసిస్‌ టెస్టులను నిర్వహిస్తున్నట్టు చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..  పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో మూడవ నంబర్‌ యూనిట్‌ నిర్మించి 43 సంవత్సరాలు అయ్యిందని, నిపుణుల ఆదేశాల మేరకు ఈ యూనిట్‌ సామర్థ్యం, ఎన్ని సంవత్సరాలు వినియోగంచవచ్చునో తెలుసుకునేందుకు  లైఫ్‌ ఎనాలసిస్‌ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందు కోసం వారం రోజుల పాటు గ్రిడ్‌ అధికారుల నుంచి ఎల్‌సీ అనుమతులు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పొల్లూరులో మూడు యూనిట్లు వినియోగంలో ఉన్నాయన్నారు. ఎగువ సీలేరులో రెండు యూనిట్లు వినియోగంలో ఉన్నాయని తెలిపారు. మొదటి యూనిట్‌ మరమ్మతులు కొనసాగుతున్నాయని, లాక్‌డౌన్‌ వలన సామగ్రి ఇతర ప్రాంతాల నుంచి రావడం వలన జాప్యం జరిగిందన్నారు. మూడవ నంబర్‌ యూనిట్‌కు డిజిటల్‌ గవర్నర్‌ అమర్చే పనులు జరుగుతున్నాయని, మరో మూడు రోజుల్లో మూడవ యూనిట్‌ వినియోగంలోకి వస్తోందని సీఈ రాంబాబు తెలిపారు. డొంకరాయి మినీ జలవిద్యుత్‌ కేంద్రం వినియోగంలోకి రావడానికి 20 రోజులు పడుతుందన్నారు. సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు, ఎగువ సీలేరు జలవిద్యుత్‌ కేంద్రాల్లో సోమవారం 4.332 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి జరిగిందని సీఈ రాంబాబు తెలిపారు. 

 


Updated Date - 2021-07-27T05:51:46+05:30 IST