భర్తను హత్య చేయించిన భార్య, సహకరించిన కూతుళ్లు.. ఎందుకో తెలిస్తే షాక్.. కోర్టు వారికి విధించిన శిక్ష ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-01T18:28:13+05:30 IST

ఆ వ్యక్తి తన భార్య వేసిన స్కెచ్‌కే బలైపోయాడు.. అతని హత్యలో కూతుళ్లు కూడా పాలు పంచుకున్నారు..

భర్తను హత్య చేయించిన భార్య, సహకరించిన కూతుళ్లు.. ఎందుకో తెలిస్తే షాక్.. కోర్టు వారికి విధించిన శిక్ష ఏంటంటే..

ఆ వ్యక్తి తన భార్య వేసిన స్కెచ్‌కే బలైపోయాడు.. అతని హత్యలో కూతుళ్లు కూడా పాలు పంచుకున్నారు.. ఇద్దరు కూతుళ్లూ స్వయంగా హంతకులకి డబ్బులు అందించారు.. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు హంతకులకు జీవిత ఖైదు విధించింది.. పెద్ద కూతురు ప్రేమకు తండ్రి అంగీకరించకపోవడమే ఈ ఘోరానికి కారణమైంది.. ప్రేమ వివాహానికి అంగీకరించని ఇంటి పెద్దను అందరూ కలిసి పకడ్బందీగా హత్య చేయించారు. చివరకు కటకటాల పాలయ్యారు. 


రాజస్థాన్‌లోని పాలికి సమీపంలోని జైతారన్ గ్రామానికి చెందిన బాబూ లాల్ అనే వ్యక్తి 2018 జూన్ 18వ తేదీ రాత్రి ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆ ఇంట్లోకి ప్రవేశించి బాబూ లాల్‌ను కత్తులతో పొడిచి చంపేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. హంతకులు దొరికిపోవడంతో కుటుంబ సభ్యుల పాత్ర బయటపడింది. పెద్ద కూతురు మమత కొన్నేళ్ల క్రితం మహిపాల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుందామనుకుంది. అందుకు బాబూలాల్ అంగీకరించలేదు. 


దీంతో బాబూలాల్ తన భార్య సుందరీ దేవి, కూతుళ్లు మమత, సుశీలకు శత్రువుగా మారిపోయాడు. వారు బాబూలాల్ అడ్డు తొలగించాలనుకున్నారు. బాబూలాల్‌ను చంపేందుకు మమత ప్రేమికుడు మహిపాల్ ఇద్దరు కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకున్నాడు. 2018 జూన్ 18వ తేదీ రాత్రి వారు ఇంట్లోకి ప్రవేశించి బాబూలా‌ల్‌ను చంపేశారు. కిరాయి హంతకులు దొరికిపోవడంతో కుటుంబ సభ్యుల పాత్ర బయటపడింది. ఈ కేసును మూడున్నరేళ్ల పాటు విచారించిన సెషన్స్ కోర్టు తాజాగా తుదితీర్పు వెలువరించింది. బాబూలాల్ భార్య, ఇద్దరు కూతుళ్లు, ప్రియుడు మహిపాల్, ఇద్దరు కిరాయి హంతకులకు జీవితఖైదు విధించింది. 

Updated Date - 2022-03-01T18:28:13+05:30 IST