పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన ఆర్‌.నారాయణమూర్తి

ABN , First Publish Date - 2020-09-23T07:29:32+05:30 IST

తన జీవితం సినిమాలకే అంకితమని ప్రముఖ సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన ఆర్‌.నారాయణమూర్తి

  • రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు
  • సినిమాకే జీవితం అంకితం
  • దేశమంతా పర్యటించాలని కోరిక
  • ప్రముఖ సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి


రౌతులపూడి : తన జీవితం సినిమాలకే అంకితమని ప్రముఖ సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రావాల్సి వస్తే ముందుగా మీడియాకే చెబుతానని అన్నారు. స్వగ్రామమైన రౌతులపూడి మండలం మల్లంపేటలో మంగళవారం ఆయన పర్యటించారు. రామాలయంలో స్థానికులతో మాట్లాడారు. ఆలయ కమిటీ ఏర్పాటు నిమిత్తం గ్రామస్థులతో సమావేశమైనట్టు చెప్పారు.




అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు కాకినాడ ఎంపీగా పోటీ చేయమని నాలుగు సార్లు అవకాశం వచ్చిందని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనను తుని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారన్నారు. మరో నాలుగు సినిమాలు తీసి డబ్బు సంపాదించి, భారతదేశమంతా పర్యటించాలని ఉందన్నారు. అనంతరం చిన్న ఇల్లు నిర్మించుకుని శేష జీవితం గడుపుతానని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గగానే తన కొత్త సినిమా యూనివర్సిటీ షూటింగ్‌ ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా నేపఽథ్యంలో నారాయణమూర్తి తల్లికి దూరం నుంచే నమస్కారం చేశారు.

Updated Date - 2020-09-23T07:29:32+05:30 IST