మాకు ప్రాణహాని ఉంది

ABN , First Publish Date - 2022-07-02T06:24:45+05:30 IST

మాకు ప్రాణహాని ఉంది

మాకు ప్రాణహాని ఉంది
గంజి ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తలారి


ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో గంజి ప్రసాద్‌ భార్య సత్యవతి
ద్వారకాతిరుమల, జూలై 1: తన భర్త హత్య కేసు నిందితులు బెయిల్‌పై విడుదలయితే వారి నుంచి తనకు, తన వారికి ప్రాణహాని ఉంటుందని, వారు గ్రామానికి రాకుండా శిక్షించాలని ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో జి.కొత్తపల్లి వైసీపీ వర్గపోరులో హత్యకు గురైన గంజి ప్రసాద్‌ భార్య సత్యవతి అన్నారు. ఇటీవల ఏలూరు ఆసుపత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ రవితేజ తప్పించుకోవడంతో తాము భయబ్రాంతులకు లోనయ్యామని ఆమె ఎమ్మెల్యేకు తెలిపారు. ఏ–6 నిందితుడు రెడ్డి సత్యనారాయణ జైలు నుంచి వచ్చాక విగ్రహాన్ని ధ్వంసం చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిసిందని ఆయనతో చెప్పారు. నిందితులు జైలు నుంచి బయటకు రాకుండా జీవిత ఖైదు విధించాలని కోరారు. గంజి ప్రసాద్‌ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే తలారి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసాద్‌ కుటుంబ సభ్యు లను పరామర్శించారు. గ్రామంలో ఆపార్టీ వర్గపోరు నేపఽథ్యంలో ఏప్రిల్‌ 30న ప్రత్యర్థులు ప్రసాద్‌ను కత్తులతో నరికి చంపిన విషయం విదితమే. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే తలారిపై కొందరు దాడికి తెగబడ్డారు. పోలీసుబలగాలు ఎంతో శ్రమించి ఎమ్మెల్యేను తప్పించారు.  2నెలల తర్వాత ప్రసాద్‌ విగ్రహావిష్కరణ నిమిత్తం తిరిగి ఆ గ్రామానికి ఎమ్మెల్యే రానుండటంతో పోలీసు బలగాలు కాపు కాశాయి. అవాంఛనీయ ఘట నలు జరగకుండా కార్యక్రమం సాఫీగా సాగింది.


Updated Date - 2022-07-02T06:24:45+05:30 IST