డౌట్స్ వద్దు.. థియేటర్లలోనే ‘లిఫ్ట్‌’

Jul 27 2021 @ 21:13PM

‘బిగ్‌ బాస్‌’ ఫేం కవిన్‌ హీరోగా నటించిన చిత్రం ‘లిఫ్ట్‌’. అమృత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని వినీత్‌ వరప్రసాద్‌ తెరకెక్కించారు. రవీంద్రన్‌ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఈ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 


వీటిపై నిర్మాత రవీంద్రన్‌ స్పందిస్తూ.. ‘లిఫ్ట్‌’ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదన్నారు. అదీకూడా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలు ఎపుడు ప్రదర్శితమవుతాయో అప్పటివరకు ఈ చిత్రాన్ని విడుదల చేయబోమని స్పష్టం చేశారు. అదేసమయంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను లిబ్రా ప్రొడక్షన్స్‌ సొంతం చేసుకుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.