Gujarat: నిర్మాణంలో ఉన్న భవంతి లిఫ్ట్ కుప్పకూలి ఏడుగురు కూలీలు దుర్మరణం

ABN , First Publish Date - 2022-09-14T22:19:23+05:30 IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న యాస్పయిర్-2 భవంతిలో..

Gujarat: నిర్మాణంలో ఉన్న భవంతి లిఫ్ట్ కుప్పకూలి ఏడుగురు కూలీలు దుర్మరణం

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ (Ahmadabad)లో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న యాస్పయిర్-2 (Aspire-2) భవంతిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్  కుప్పకూలి (Lift collapse) ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఒకరు గాయపడ్డారు. ఏడో అంతస్తు నుంచి ఈ  లిఫ్ట్ కుప్పకూలింది. గుజరాత్ యూనివర్శిటీకి సమీపంలో ఈ భవన నిర్మాణం సాగుతోంది. కాగా, ప్రమాదంలో మరణించిన కూలీలను సంజయ్‌భాయ్ బాబుభాయ్ నాయక్, జగదీష్‌భాయ్ రమేష్‌భాయ్ నాయక్, అశ్విన్‌భాయ్ సోంభాయ్ నాయక్, ముఖేష్ భరత్‌భాయ్ నాయక్, ముఖేష్‌భాయ్ భరత్‌భాయ్ నాయక్, రాజ్మల్ సురేష్‌భాయ్ ఖరాడి, పంకజ్‌భాయ్ శంకర్‌భాయ్ ఖరాడిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 


''మున్సిపల్ కార్పొరేషన్ నియమ నిబంధలను బిల్టర్లు ఉల్లంఘించారా అనేది తెలుసుకుంటున్నాం. తప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం'' అని మేయర్ కేజే పర్మార్ తెలిపారు. కాగా, ఈ దుర్ఘటన తెల్లవారుజామున జరిగినప్పటికీ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో పోలీసులకు బిల్డర్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లిఫ్ట్ కుప్పకూలిన సమయంలో అందులో ఎనిమిది మంది కార్మికులు ఉన్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2022-09-14T22:19:23+05:30 IST