Yellampalli ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-07-20T14:08:45+05:30 IST
జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.
మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్(Yellampalli project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 16 గేట్లను ఎత్తివేసి 82 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 82 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 16.6650 టీఎంసీలుగా నమోదు అయ్యింది.