ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-24T04:36:16+05:30 IST

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసా గుతోంది. దీంతో అధికా రులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు.

ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
కుమరం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బయటకు వెళుతున్న వరదనీరు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 23: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసా గుతోంది. దీంతో అధికా రులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. కుమరం భీం ప్రాజెక్టులోకి శుక్రవారం 58, 343 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ఏడు గేట్లు ఎత్తి 58,332 క్యూసెక్కుల నీటి ని కిందకు వదిలారు. మధ్యాహ్నం వరకు వరద ఉధృతి తగ్గడంతో నాలుగు గేట్లను మూశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243మీటర్లు కాగా ప్రస్తుతం 241.650మీటర్లకు చేరుకుంది. అలాగే వట్టి వాగు ప్రాజెక్టులోకి 760క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఒక గేటు ఎత్తి360 క్యూసెక్కుల వరద నీటిని బయటకు వదులుతున్నారు. సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గడంతో ఒకగేటును మూశారు. వర్షాలకు మండలంలో వందలాది ఎకరాల పంటనష్టం జరి గింది. కొన్నిచోట్ల పత్తి పంట నీటిలోనే ఉండగా, మరికొన్ని చోట్ల ఇసుక మేటలు వేసింది. కుమరం భీం, వట్టివాగుప్రాజెక్టులను నీటిపారుదలశాఖ సీఈ కెరమేష్‌ పరిశీలించారు.

Updated Date - 2021-07-24T04:36:16+05:30 IST