
బాలీవుడ్ సీనియర్ నటుడు చంకీ పాండే కూతురు అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ -2 సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘‘ కాలీ పీలీ’’, ‘‘ పతి, పత్నీ ఔర్ వో ’’చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లోకి కూడా త్వరలోనే ఆమె ఎంట్రీ ఇవ్వబోతోంది. విజయ్ దేవరకొండ సరసన ‘‘ లైగర్ ’’ చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అనన్య పాండేకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు దాదాపుగా 21 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రాంలో ఆమె కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. బోల్డ్‌గా దర్శనమిచ్చింది. ఆ ఫొటోలకు అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ స్పందనను తెలుపుతున్నారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె అభిమానులు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అనన్య ప్రస్తుతం ‘‘ గ్రెహాయా ’’ సినిమాలో నటిస్తుంది. దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది తదితరులు కీలక పాత్రలు పోషించారు. శకున్ బత్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కానుంది.