
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pande) హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైగర్' (Liger). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannath) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పూరీ టీమ్ ఈ సినిమాలోని ఫైనల్ సాంగ్ షూట్ కోసం రెడీ అవుతున్నారట. ఇప్పటికే టాకీపార్ట్ మొత్తం పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఒక్క సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా, అది ఇప్పుడు పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. ఈ సాంగ్ చిత్రీకరణతో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఆ తర్వాత 'లైగర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల గురించి ఒక ప్లాన్ సిద్దం అయిందని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.
దర్శకుడిగా పూరికి, హీరోగా విజయ్ దేవరకొండకు 'లైగర్' మొదటి పాన్ ఇండియా చిత్రం. అందుకే, ప్రమోషన్స్‌కు కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని డిసైడయ్యారట. దాదాపు 6 వారాల ముందు నుంచే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి (Charmy), కరణ్ జొహార్ (Karan Johar) నిర్మాతలు. ఇక పూరి - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఇప్పుడు 'జనగణమన' సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఇది కూడా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.