ప్రభాకర్‌ నాయకత్వంలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు

ABN , First Publish Date - 2022-09-29T04:59:56+05:30 IST

చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతాప్రభాకర్‌ నాయకత్వంలో చేనేత కార్మికుల అభివృద్ధి జరుగుతుందని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తెలిపారు.

ప్రభాకర్‌ నాయకత్వంలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు
చింతాప్రభాకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందిస్తున్న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చింతా ప్రభాకర్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు28: చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతాప్రభాకర్‌ నాయకత్వంలో చేనేత కార్మికుల అభివృద్ధి జరుగుతుందని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన చింతా ప్రభాకర్‌ బుధవారం హైదరాబాద్‌లో నారాయణగూడలోని టెస్కోభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హజరైన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు మాట్లాడారు. చేనేత రంగం అభివృద్ధి చేసేందుకు ప్రభాకర్‌ కృషి చేస్తారన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలన్నారు. ఇందుకు ప్రభుత్వ పరంగా ఏ రకమైన ప్రోత్సాహం కావాలన్నా అందిస్తామని వారు హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే వస్త్రాలపై కేంద్రం జీఎ్‌సటీ విధించి, వారి జీవితాల్లో చీకట్లు నింపిందని విమర్శించారు. చేనేత కార్మికుల జీవన స్థితి గతులను దృష్టిలో ఉంచుకుని, చేనేత వస్ర్తాలపై జీఎస్టీ రద్దు చేయాలని మంత్రులు కేంద్రాన్ని కోరారు. అనంతరం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చింతాప్రభాకర్‌ మాట్లాడారు. తనపైౖ నమ్మకం ఉంచి చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, సహకరించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి, సీఎం కేసీఆర్‌కు మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానని ప్రభాకర్‌ తెలిపారు. కార్యక్రమానికి హాజరైన  మిగతా మంత్రులుమహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు జి.మహిపాల్‌రెడ్డి, కె.మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, ఫారుక్‌హుస్సేన్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి తదితరులు చింతాప్రభాకర్‌ను అభినందించారు. 

Updated Date - 2022-09-29T04:59:56+05:30 IST