IMD tweet : పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు

Published: Mon, 09 Aug 2021 07:15:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
IMD tweet : పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు పలు పరిసర రాష్ట్రాల్లో సోమవారం ఉదయం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది.ఢిల్లీతోపాటు ఘజియాబాద్, ముజప్ఫర్ నగర్, హస్తినాపూర్, గర్హముక్టేశ్వర్, దేవ్ బంద్, అమ్రోహ, రోహతక్, గోహానా, గన్నూర్ ప్రాంతాల్లో రాగల రెండు గంటల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. దేవ్ బంద్, నజీబాబాద్, ముజప్ఫర్ నగర్, బిజ్నూర్, సాకోటి తండా, హస్తినాపూర్, దౌరాల,మీరట్, మోదీనగర్, మొరాదాబాద్, బిల్లారి, మిలక్, చాందౌసీ, బహజోయ్, ఇగ్లాస్, రాయ, హత్రాస్, జాలేసర్, సదాబాద్, విరాట్ నగర్, రాజ్ ఘడ్ ప్రాంతాల్లో సోమవారం రాగల రెండు గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా ట్వీట్ చేసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.