పార్టీకి మేకప్‌ ఇలా..

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

న్యూఇయర్‌ పార్టీ అంటేనే తళుకుబెళుకులు.. పార్టీ ఫొటోల్లో

పార్టీకి మేకప్‌ ఇలా..

న్యూఇయర్‌ పార్టీ అంటేనే తళుకుబెళుకులు.. పార్టీ ఫొటోల్లో బాగా కనిపించాలంటే మేకప్‌ కూడా సరిగ్గా ఉండాలి. అలాంటి మేకప్‌ చేసుకోవటం ఎలాగో చూద్దాం..


జుట్టు ముందు భాగంలో కాంటూరింగ్‌ చేయటం వల్ల నుదురు చిన్నగా కనిపిస్తుంది


ముక్కు సన్నంగా కనబడాలంటే.. ముక్కుకు రెండు వైపులా కాంటూరింగ్‌ చేయాలి


ముక్కు దూలాన్ని హైలెట్‌ చేస్తే ముక్కు సూటిగా కనబడుతుంది


పెదవుల మధ్యలో లిప్‌స్టిక్‌ చిక్కగా వేస్తే పెదవులు పూర్తి షేప్‌లో కనబడతాయి


దవడ ఎముకల అడుగున కాంటూరింగ్‌ చేస్తే ముఖ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది


కాంటూరింగ్‌ అంటే..

చర్మం రంగు కన్నా లేత లేదా ముదురు రంగును వేయటాన్ని కాంటూరింగ్‌ అంటారు. దీని వల్ల ముఖ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా పార్టీలకు వెళ్లేటప్పుడు కాంటూరింగ్‌ అవసరమవుతుంది. 


కనురెప్పల పైభాగంలో షేడ్‌ వేస్తే- కళ్ల ఆకారం.. కనుబొమ్మల షేప్‌ బాగా కనబడతాయి


దవడ కండరం కింది భాగంలో కాంటూరింగ్‌ చేయటం వల్ల ముఖ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది.


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST