పార్టీ మేకప్‌ ఇలా...

ABN , First Publish Date - 2022-05-23T07:14:10+05:30 IST

ఎలాంటి మేకప్‌ కోసమైనా, చర్మం శుభ్రంగా ఉండి తీరాలి. కాబట్టి చర్మపు పిహెచ్‌ వాల్యూకి తగిన సబ్బు లేదా ఫేస్‌ వాష్‌తో ముఖం శుభ్రపరుచుకోవాలి.

పార్టీ మేకప్‌ ఇలా...

పార్టీ మేకప్‌ అంటే, నలుగురిలో ఆకర్షణీయంగా, 

ప్రత్యేకంగా కనిపించేలా ఉండాలి. అందుకోసం ఎంచుకునే మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండడంతో పాటు, చర్మాన్ని చికాకు పెట్టకుండా ఉండాలి. కాబట్టి పార్టీ మేకప్‌ కాస్మటిక్స్‌ను ఆచితూచి ఎంచుకోవాలి. 

స్కిన్‌ ప్రిపరేషన్‌: ఎలాంటి మేకప్‌ కోసమైనా, చర్మం శుభ్రంగా ఉండి తీరాలి. కాబట్టి చర్మపు పిహెచ్‌ వాల్యూకి తగిన సబ్బు లేదా ఫేస్‌ వాష్‌తో ముఖం శుభ్రపరుచుకోవాలి. చక్కెర స్క్రబ్‌తో పెదవుల మీద మృత చర్మాన్ని కూడా వదిలించాలి. తర్వాత పెదవులకు లిప్‌ మాస్క్‌ వేసుకోవాలి. తర్వాత ముఖ చర్మం తేమ కోల్పోకుండా ఉండడం కోసం, హైడ్రేటింగ్‌ సీరమ్‌ లేదా మన్నికైన మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. ఇలాంటి స్కిన్‌ ప్రిపరేషన్‌తో మేకప్‌ మొదలుపెడితే, మేకప్‌ చర్మం మీద సమంగా పరుచుకుని, రెట్టింపు ఆకర్షణను తెచ్చిపెడుతుంది.


చర్మానికి తగిన ప్రైమర్‌: జిడ్డు చర్మమైతే మాటిఫైయింగ్‌ లేదా సిలికాన్‌ ఫ్రీ ప్రైమర్‌ ఎంచుకోవాలి. పొడి చర్మమైతే, హేడ్రేటింగ్‌, ల్యూమినస్‌ బ్రైటెనింగ్‌, గ్లోయింగ్‌ అనే లేబుల్‌ ఉన్న ప్రైమర్‌ ఎంచుకోవాలి. అలాగే దాన్లో విటమిన్‌ సి ఉండేలా చూసుకోవాలి. 


 ఫౌండేషన్‌: దీర్ఘకాలం పాటు పాడవకుండా ఉండే ఫౌండేషన్‌ ఎంచుకోవాలి. కాబట్టి 12 నుంచి 16 గంటల పాటు చెక్కుచెదరకుండా ఉండే ఫౌండేషన్‌ వాడుకోవాలి. ఇందుకోసం లాంగ్‌ వేర్‌, ట్రాన్స్‌ఫర్‌, స్వెట్‌ రెసిస్టెంట్‌ ఫార్ములాతో కూడిన ఫౌండేషన్‌ కోసం వెతకాలి.


కలర్‌ కరెక్ట్‌: కళ్ల దిగువన ఉండే నల్లని వలయాలను కనిపించకుండా చేయడం కోసం, బ్రైట్‌ నుంచి బ్రిక్‌ టోన్‌లో ఉండే ఆరెంజ్‌ కరెక్టర్‌ సూటవుతుంది. తెల్లని చర్మం కలిగినవాళ్లకు పీచ్‌ రంగులోని కలర్‌ కరెక్టర్‌ బాగుంటుంది. కరెక్షన్‌ కోసం మొదట అవసరమైన ప్రదేశంలో కలర్‌ కరెక్టర్‌ అప్లై చేసి, వేళ్లతో లేదా బ్రష్‌తో 

అద్దుకోవాలి. 


కన్‌సీలర్‌: మొటిమలు, కళ్ల కింది వలయాలను దాచడం కోసం కన్‌సీలర్‌ ఉపయోగించాలి. అయితే దీన్ని అప్లై చేసే ముందు ఆ ప్రదేశాల్లో ట్రాన్స్‌క్యులెంట్‌ పౌడర్‌ను అప్లై చేయాలి. తర్వాత దాని మీద కన్‌సీలర్‌ అద్ది, అంచులు కలిసిపోయేలా బ్రష్‌తో అద్దుకోవాలి.  


బ్లష్‌: మేకప్‌ ఫ్లాట్‌గా కనిపిస్తుందంటే కచ్చితంగా బ్లష్‌ అప్లై చేసుకోవాలి. చక్కని మెరుపు, వర్ఛస్సుతో కనిపించడానికి బ్లష్‌ తోడ్పడుతుంది.


హై లైటర్‌: ముక్కు, చుబుకం, బుగ్గలు, నుదురు... ఈ ప్రదేశాల్లో హై లైటర్‌ వాడుకుంటే, ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

Updated Date - 2022-05-23T07:14:10+05:30 IST