ఇలాగేనా..? సచివాలయం నిర్వహించేది : జేసీ

ABN , First Publish Date - 2022-08-13T05:20:00+05:30 IST

నిత్యం వచ్చిపో యే ప్రజలు..ప్రభుత్వ పథకాలు అమలు చేసే సచివాలయ నిర్వహణ ఇలాగేనా..? అంటూ జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌అన్సారియా ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ఇలాగేనా..? సచివాలయం నిర్వహించేది : జేసీ
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 12: నిత్యం వచ్చిపో యే ప్రజలు..ప్రభుత్వ పథకాలు అమలు చేసే సచివాలయ నిర్వహణ ఇలాగేనా..? అంటూ జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌అన్సారియా ఆగ్ర హం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని 10, 12, 18 వార్డు సచివాలయాలను జేసీ ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఈ సచివాలయాల్లో చెత్త శుభ్రం చేయకుండా, డస్ట్‌బిన్‌లు నిండిపో యాయి. అలాగే శుభ్రం చేయకుండా అస్తవ్యస్తం గా ఫైలు పెట్టివుంచడం జేసీ దృష్టిలో పడింది. దీంతో జేసీ మాట్లాడుతూ మీ ఇళ్లలో ఇలాగే చెత్తవుంచుకుంటారా?అని మందలించారు. సిబ్బంది టేబుళ్లపై వారి పేర్లు, ఏమి విధులు నిర్వహిస్తారో బోర్డులు పెట్టాలన్నారు. ప్రజలకు అందే సంక్షేమపథకాలను, లబ్ధిదారుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాల న్నారు. ఇంకో సారి ఇలాంటి తప్పులు దొర్లితే చర్యలు కఠినంగా వుంటాయని హెచ్చరిం చారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల పాల్గొన్నారు.


Updated Date - 2022-08-13T05:20:00+05:30 IST